AP Governor : నిలకడగా ఏపీ గవర్నర్ ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిస్వాస్ భూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

Ap Governor

Biswas Bhushan Harichandan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిస్వాస్ భూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇవాళ కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా… నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు. సోమవారం మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు.

ఆక్సిజన్ మీద నిలకడగా ఉన్నారని, సాచురేషన్ లెవెల్స్ కూడా బాగానే మెయిన్ టెయిన్ అవుతున్నాయని తెలిపారు. ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Loss To TTD : భారీ వర్షాలతో టీటీడీకి రూ.4 కోట్లకు పైగా నష్టం

గవర్నర్ బిస్వాస్ భూషణ్ హరిచందన్ (88) నవంబర్ 17న మధ్యాహ్నం ఒంటి గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో చేరారు. నవంబర్ 15వ తేదీన గవర్నర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ ఏపీ రాష్ట్ర గవర్నర్‌ అయ్యారు.

2019 జూలై నుంచి ఏపీ గవర్నర్‌గా విధుల్లో వున్నారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ నాయకుడిగానే కాకుండా లాయర్‌గా, రచయితగానూ ఆయన గుర్తింపు పొందారు.