ఏపీ కోలుకొంటోంది. పాజిటీవ్ కేసులకన్నా, డిశ్చార్జ్ అయ్యేవాళ్లే ఎక్కువ.

  • Publish Date - September 14, 2020 / 06:19 PM IST

ap corona cases: గడిచిన 24 గంటల్లో ఏపీ కోలుకున్నట్లే కనిపిస్తోంది. మొత్తంమీద 61,529 శాంపిల్స్ పరీక్షించగా, 7,956 మందికి పాజిటీవ్‌గా తేలింది. అదే సమయంలో 9,764 మంది కోలుకొని ఇంటికెళ్లారు. ఇది శుభవార్త.

కొద్దిరోజులుగా పాజిటీవ్ కేసులు పదివేలకు అటూ ఇటూ నమోదువుతున్నా, అంతకన్నా ఎక్కువమంది ఆరోగ్యవంతులవుతున్నారు. నెగిటీవ్‌గా తేలుతున్నారు. అంటే వచ్చే పాజిటీవ్ రోగులకన్నా, డిశ్చార్జ్ అయ్యే వాళ్లే ఎక్కువ. దేశ వ్యాప్తంగా ఈ ట్రెండ్ నడుస్తున్నా, ఏపీలో ఎక్కువమంది డిశ్చార్జ్ అవుతున్నారు



తూర్పుగోదావరిలో 1412 పాజిటీవ్ కేసులు కొత్తగా నమోదవగా, పశ్చిమగోదావరిలోనూ వెయ్యికి మించి కేసులు నమోదైయ్యాయి. ఈ గోదావరి జిల్లాల్లో కరోనా కట్టడి కాలేదనినిపిస్తోంది.