Junior Doctors Strike : సమ్మెకి దిగిన జూనియర్ డాక్టర్లు

ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్నారు.

Junior Doctors Strike : ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్నారు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. కాగా, ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపేందుకు జూడాల ప్రతినిధులు వెళ్లారు. వైద్య ఆరోగ్య మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తామని జూడాలు తెలిపారు.

ఇవాళ్టి(జూన్ 9,2021) నుంచి రెసిడెంట్‌ జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. ఇప్పటికే జూడాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఉదయం నుంచి విధులు బహిష్కరించారు. ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తమకు కొవిడ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని.. స్టైఫండ్‌లో టీడీఎస్‌ కోత విధించొద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఈరోజు కొవిడ్‌తో సంబంధం లేని విధులు, 10వ తేదీన కొవిడ్‌ విధులు, 12వ తేదీన కొవిడ్‌ అత్యవసర విధులను బహిష్కరించనున్నట్లు జూడాలు ప్రకటించారు.

జూడాల డిమాండ్లు:

* ఆరోగ్య బీమా కల్పించాలి

* ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

* కొవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలి

* స్టైఫండ్ లో టీడీఎస్ కట్ చేయకూడదు

* ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలి

ట్రెండింగ్ వార్తలు