Botsa Satyanarayana On BRS: అది వాళ్ల ఇష్టం.. బీఆర్ఎస్ ప్రభావం మాపై ఉండదు: ఏపీ మంత్రి బొత్స

బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని వ్యాఖ్యానించారు. ఏపీల్లో ఉన్న పార్టీల్లో ఇకపై బీఆర్ఎస్ కూడా ఒకటవుతుందని, అంతకు మించి ఏమీ జరగబోదని చెప్పారు. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తూ ఉంటాయని చెప్పారు.

Botsa Satyanarayana On BRS: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభావం తమపై ఉండదని ఏపీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిన్న టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఏపీలోనూ కేసీఆర్ సభలు పెడతారని ప్రచారం జరుగుతోంది.

దీనిపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ… తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని వ్యాఖ్యానించారు. ఏపీల్లో ఉన్న పార్టీల్లో ఇకపై బీఆర్ఎస్ కూడా ఒకటవుతుందని, అంతకు మించి ఏమీ జరగబోదని చెప్పారు. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిదని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ… ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తూ ఉంటాయని చెప్పారు. పబ్లిక్ ఎజెండాతో కొత్త పార్టీలు రావచ్చని, పోటీ పెరిగితే పని తీరు మెరుగుపడుతుందని అన్నారు. కొత్త పార్టీల గురించి వైసీపీ ఆలోచించట్లేదని ఆయన చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు