టీడీపీ-జనసేన కూటమితో పొత్తు, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ

ఎన్నికల షెడ్యూల్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తుకు సిద్ధమైంది బీజేపీ. శనివారం ఢిల్లీ కేంద్రంగా టీడీపీ-జనసేనతో పొత్తు విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

andhra pradesh polls 2024 bjp to tie up with janasena and tdp

BJP Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా.. లేదంటే కమలం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై క్లారిటీ ఇచ్చేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు, పరిస్థితులపై బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది.

ఇన్నాళ్లూ పొత్తులపై మౌనం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. ఎన్డీయే కూటమిలో లేకపోయినా పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతూనే ఉంది. మరోవైపు టీడీపీ గతంలో ఎన్డీయే కూటమిలో ఉండగా.. జనసేన ఇప్పటికే భాగస్వామ్య పార్టీగా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జట్టు కట్టిన రెండు పార్టీ.. బీజేపీని తమతో కలుపుకోవాలని ప్రణాళిక రచించాయి. అయితే.. కూటమిలో చేరడం వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ పొత్తులపై మౌనం వహిస్తూ వచ్చింది బీజేపీ.

ఐదు ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు?
ఎన్నికల షెడ్యూల్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తుకు సిద్ధమైంది బీజేపీ. శనివారం ఢిల్లీ కేంద్రంగా టీడీపీ-జనసేనతో పొత్తు విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో తమకు 10 ఎంపీ సీట్లు కావాలని బీజేపీ ఇప్పటికే ప్రతిపాదన పెట్టగా.. ఐదు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ-జనసేన అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సమాలోచనలు జరిపిన ఢిల్లీ బీజేపీ పెద్దలు.. ఐదు ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో ట్విస్ట్.. మళ్లీ రంగంలోకి నాగార్జున!

బీజేపీ కోరుతున్న ఎంపీ సీట్లలో అరకు, తిరుపతి, హిందూపురం, కర్నూలు, రాజమండ్రి లేదా ఏలూరు స్థానాలున్నాయి. ఇక శ్రీకాకుళం, విశాఖ నార్త్, పాడేరు, మాడుగుల, కైకలూరు, నరసాపురం, నరసరావుపేట, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లె, తిరుపతి అసెంబ్లీ సీట్లు ఆశిస్తోంది బీజేపీ.

Also Read: అందుకే జనసేనకు రాజీనామా చేసి.. వైసీపీలో చేరాను: చేగొండి సూర్యప్రకాశ్

ఢిల్లీలో జరిగే సమావేశంలో పొత్తుతో పాటు సీట్ల విషయంలోనూ క్లారిటీ ఇవ్వనుంది బీజేపీ అధిష్టానం. అనుకున్నట్లుగా పొత్తు కుదిరితే టీడీపీ-జనసేనతో కలిసి కమల దళం కూడా ప్రచార రంగంలోకి దిగనుంది.

ట్రెండింగ్ వార్తలు