Andhra Pradesh PRC : పీఆర్సీ పిటిషన్.. నిర్ణయం తీసుకొనే అధికారం తమకు లేదు

ఈ పిటిషన్ విచారించే రోస్టర్ లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని...

AP High Court PRC : పీఆర్సీపై ఎవరి పట్టు వారిదే అన్నట్లుగా ఏపీలో పరిస్థితి ఉంది. సమ్మెకు వెళ్లేందుకే ఉద్యోగ సంఘాలు..సుముఖంగా ఉన్నాయి. ఈ క్రమంలో..హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ విచారించే రోస్టర్ లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని వ్యాఖ్యానించింది. న్యాయస్థానం అందుకే ఈ పిటిషన్ సీజే కి పంపుతున్నామని న్యాయమూర్తి వెల్లడించారు.

Read More : Yoga : యోగాకు ముందు…తరువాత… పాటించాల్సిన ఆహారనియమాలు

ఈ పిటిషన్ ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. అంతకుముందు జరిగిన విచారణలో స్టీరింగ్‌ కమిటీలోని 12 మంది సభ్యులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. పిటిషనర్‌ కూడా హాజరుకావాలని ఏపీ హైకోర్టు సూచించింది. మరోవైపు..కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా సీఎస్‌కు నోటీసు ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 17నుంచి సమ్మెకు వెళ్లనున్నాయి.

Read More : Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. త్వరలో ప్రకటన!

ఇదిలా ఉంటే… 11వ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగసంఘాలు చేస్తున్న పోరాటానికి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అశుతోష్‌ మిశ్రా నివేదికను బహిర్గతం చేయాలని, ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్‌ నెరవేర్చాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌. లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగులతో ఘర్షణ పడిన ప్రభుత్వాలేవీ నిలబడలేదని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు