Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. త్వరలో ప్రకటన!

విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి హఠాత్తుగా వైదొలిగిన తర్వాత, అతని స్థానంలో టీమ్ ఇండియాలో చోటు దక్కించుకునే అభ్యర్థుల జాబితా చాలా పెద్దదిగా ఉంది.

Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. త్వరలో ప్రకటన!

Test Captain

Test Captain of Team India: విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి హఠాత్తుగా వైదొలిగిన తర్వాత, అతని స్థానంలో టీమ్ ఇండియాలో చోటు దక్కించుకునే అభ్యర్థుల జాబితా చాలా పెద్దదిగా ఉంది.

కొందరు సీనియర్ ఆటగాళ్లు, మరికొందరు యువ క్రికెటర్లు కూడా కెప్టెన్సీ రేసులో ముందున్నారు. అయితే, టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరునే బీసీసీఐ దాదాపుగా నిర్ణయించిందని, త్వరలో ప్రకటించొచ్చని ఓ నివేదిక పేర్కొంది.

బీసీసీఐ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రెడ్ బాల్ క్రికెట్‌కు తదుపరి కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసేందుకు సిద్ధమైందని, వెస్టిండీస్‌తో సిరీస్‌ ప్రారంభానికి ముందే కెప్టెన్ పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు.

రోహిత్ శర్మ భారత కొత్త టెస్ట్ కెప్టెన్‌గా ఉంటాడనడంలో సందేహం లేదని, దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మను టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించగా.. ఇప్పుడు అతనికి పదోన్నతి కల్పించి జట్టుకు కెప్టెన్‌గా చేయనున్నారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ఈ అదనపు భారం మోయడానికి రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై అదనంగా శ్రమించాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారి తెలిపారు. రోహిత్‌పై పనిభారం పెరుగుతుందని, సెలక్టర్లు అతనితో కూడా దీని గురించి మాట్లాడతారని చెబుతున్నారు.

కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా భవిష్యత్‌ కెప్టెన్లు కాగలరని కూడా వర్గాలు చెబుతున్నాయి. సెలక్టర్లు వారిలో ఒకరికి వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తులో కెప్టెన్సీకి తగిన విధంగా వారిని సన్నద్ధం చేసేందుకు సెలక్టర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.