×
Ad

Andhra Pradesh Covid 19 : ఏపీలో కరోనా తగ్గుముఖం, నాలుగు జిల్లాల్లో సున్నా కేసులు

కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 40 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన...

  • Published On : March 19, 2022 / 06:58 PM IST

Ap Corona

Andhra Pradesh Covid 19 Cases : కరోనా వైరస్ నుంచి ఏపీ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి ప్రజలు బయటపడుతున్నారు. కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 40 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,19,181 పాజిటివ్ కేసులకు గాను…23,03,933 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

Read More : China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. 2ఏళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!

ఇప్పటి వరకు 14,730 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 518గా ఉందని తెలిపింది. 8 వేల 081 శాంపిల్స్ పరీక్షించగా…40 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 58 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,33,22,836 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 11. చిత్తూరు 02. ఈస్ట్ గోదావరి 07. గుంటూరు 03. వైఎస్ఆర్ కడప 00. కృష్ణా 00. కర్నూలు 00. నెల్లూరు 03. ప్రకాశం 01. శ్రీకాకుళం 03. విశాఖపట్టణం 03. విజయనగరం 00. వెస్ట్ గోదావరి 07.
– మొత్తం : 40