AP Covid-19 Update : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న తాజాగా 1,257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు.

AP Covid update

AP Covid-19 Update :  ఆంధ్రప్రదేశ్‌లో  కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న తాజాగా 1,257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు. కోవిడ్ వల్ల నిన్న గుంటూరు విశాఖపట్నంలలో ఒక్కోక్కరు చొప్పున మరణించారు. నిన్న కోవిడ్‌కు చికిత్స పొంది 140 మంది కోలుకున్నారు.

చిత్తూరు జిల్లాలో నిన్న అత్యధికంగా 254 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 196, అనంతపురంలో 138, కృష్ణా జిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 104, తూర్పు గోదావరి జిల్లాలో 93 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Also Read : Vellore CMC Covid Cases : వెల్లూరు సీఎంసీలో 200 మంది డాక్టర్లు,సిబ్బందికి కరోనా
రాష్ట్రంలో ఇంతవరకు 3,16,05,951 మందికి పరీక్షలునిర్వహించగా… వీరిలో 20,81, 859 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది.వీరిలో 20,62, 580 మంది కోవిడ్‌‌కు   చికిత్స పొంది కోలుకున్నారు. 14,505 మంది కోవిడ్ వల్ల మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,774 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Ap Covid Up Date