Andhra Pradesh Covid : ఏపీలో కరోనా, 24 గంటల్లో 13 వేల 400 కేసులు, 94 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు 13 వేల కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా..24 గంటల 13 వేల 400 మందికి కరోనా సోకింది. 94 మంది చనిపోయారు.

Ap Covid 19

COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇటీవలే 20వేల తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 13 వేల కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా..24 గంటల 13 వేల 400 మందికి కరోనా సోకింది. 94 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 1,65,795 యాక్టివ్ కేసులున్నాయి. 10 వేల 832 మంది చనిపో్యారు. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 2 వేల 598 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20 వేల 392 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

జిల్లాల వారీగా మృతుల వివరాలు :

చిత్తూరులో 14 మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, తూర్పు గోదావరిలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఎనిమిది మంది, విశాఖపట్టణంలో ఎనిమిది మంది, కృష్ణాలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, వైఎస్ఆర్ కడపలో నలుగురు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు :

అనంతపురం 1215. చిత్తూరు 1971. ఈస్ట్ గోదావరి 2598. గుంటూరు 848. వైఎస్ఆర్ కడప 701. కృష్ణా 858. కర్నూలు 712. నెల్లూరు 652. ప్రకాశం 838. శ్రీకాకుళం 623. విశాఖపట్టణం 1054. విజయనగరం 362. వెస్ట్ గోదావరి 968. మొత్తం : 13,400.

Read More :Orphans by Covid: కొవిడ్ కారణంగా పేరెంట్స్‌లో ఏ ఒక్కరు పోయినా నెలకు రూ.1500