AP Covid Cases Update : ఏపీలో కొత్తగా 184 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 184 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర   వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

  • Updated on- December 1, 2021 / 06:02 PM IST

Ap Covid Cases Up Date

AP Covid Cases Update :  ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 184 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర   వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్న కోవిడ్ నుంచి 183 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 వేల 149 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 73వేల 93 కి చేరింది.  వీరిలో 20 లక్షల 56 వేల 501 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కోవిడ్ వల్ల మరణించారు.
Also Read : Omicron Threat : అక్కడ 90 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌‌..ఆందోళనలో రాజధాని
ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 443 కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 3 కోట్ల 4 లక్షల 46 వేల 6 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.