Omicron Threat : అక్కడ 90 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌‌.. భయాందోళనలో ప్రజలు

జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్‌ ప్రావిన్స్‌ ప్రస్తుతం మరో వుహాన్‌గా మరింది. ఇక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌కి చెందినవేనని చెబుతున్నారు నిపుణులు.

Omicron Threat : అక్కడ 90 శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌‌.. భయాందోళనలో ప్రజలు

90 % New Covid Variant Omicron Cases In Gauteng

90 % new covid variant omicron cases in gauteng : దాదాపు రెండేళ్ల క్రితం చైనాలోని ఊహాన్ లో పుట్టి ప్రపంచాన్ని ఈనాటికి హడలెత్తిస్తున్న కరోనా మరోసారి ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఒమిక్రాన్‌ గా మరోసారి గుబులు పుట్టిస్తోంది. గతంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌ కన్నా ఇది చాలా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. లాక్ డౌన్ లతో జనాలు విసుగెత్తిపోయారు.ఎంతోమంది వీధిన పడ్డారు. ఉద్యోగాలు, ఉపాధులు పోగొట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. ఇక పూర్తిగా నాశనమువుతుందనే ఆశతో ఉన్న జనాలకు కరోనా మరోసారి ఝలక్ ఇచ్చింది. ఒమిక్రాన్ గా జనాలను భయపెడుతోంది. కరోనా మూల కేంద్రాన్ని చైనా వుహాన్‌గా గురించారు శాస్త్రవేత్తలు. ఇక్కడి నుంచే కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

Read more : Omicron : ఎయిర్ పోర్టులో ఒక్క యాంటీజెన్​ టెస్ట్​ రూ.4,000 వసూలు

ఈక్రమంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ మూల కేంద్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ వేరియంట్‌ ప్రథమంగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ ను మొదటిగా సౌతాఫ్రికాకు చెందిన డాక్ట‌ర్ ఓ మహిళా డాక్టర్ గుర్తించారు. ఆమె పేరు ‘డాక్ట‌ర్ ఆంగెలిక్యూ కొయెట్జీ’. అయితే..సౌతాఫ్రికాలోని ష్వానే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒమిక్రాన్‌ కేంద్రంమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్‌లోని చాలా మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

90 శాతం కేసుల్లో ఒమిక్రాన్‌…
సౌతాఫ్రియా రాజధాని జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్‌ ప్రావిన్స్‌ ప్రస్తుతం మరో వుహాన్‌గా మరింది. ఇక్కడ నమోదవుతున్న కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌కి చెందినవేనని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ కేసులు ఇంతలా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం… వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండటమే.

గౌటెంగ్‌ ప్రావిన్స్‌ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే యూనివర్శిటీలు, కాలేజీలు మూత పడ్డాయి. విద్యాసంస్థల్లో పరీక్షలు కూడా వాయిదా వేశారు. ప్రతీ ఒక్కరిని పరీక్షిస్తున్నారు. సౌతాఫ్రికాలో ఉన్న ఈ పరిస్థితితో భయపడుతున్న పలు దేశాలు ఇప్పటికే ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. ఈ నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Read more :  International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

దక్షిణాఫ్రికాలో 18-34 ఏళ్ల మధ్య ఉన్న వారిలో కేవలం 22 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. టీకాపై అపోహల కారణంగా కూడా చాలామంది వ్యాక్సిన్‌ వేయించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే వ్యాక్సిన్‌ వేసుకున్న వారు.. తమ తోటివారిని టీకా వేసుకోమని సూచిస్తున్నారు. కానీ పెద్దగా ఎవ్వరు వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపించటంలేదు. డెల్టా వేరియంట్‌ కారణంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య కూడా భారీగానే నమోదయ్యింది. ప్రభుత్వాలు డెల్టా వేరియంట్‌ని ప్రారంభంలో నిర్లక్ష్యం చేశాయి. ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికి భయపడుతున్న పరిస్థితి.