International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

  డిసెంబర్​ 15 నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు బుధవారం పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది.

International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

Flights (2)

International Flights :  డిసెంబర్​ 15 నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు బుధవారం పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్​ “ఒమిక్రాన్” ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న సమయంలో అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. విమానాల పునరుద్ధరణ ఎప్పటి నుంచి అనేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది.

కాగా,కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని గత నెలలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఇటీవల ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోఅంతర్జాతీయ విమానాల పునరుద్ధరణను డీజీసీఏ వాయిదా వేసింది.

అయితే,28 దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా కొన్ని నిర్దేశించిన దేశాలకు మాత్రమే ప్రస్తుతం భారత్ నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ALSO READ Omicron Threat : ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన నలుగురికి కరోనా