Omicron Threat : ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన నలుగురికి కరోనా

దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన

Omicron Threat : ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన నలుగురికి కరోనా

Delhi2

Omicron Threat : దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా కంటే ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్‌లో 50 ముట్యేషన్లు ఉన్నట్టు భావిస్తుండగా.. స్పైక్ ప్రొటీన్‌పే 30కిపైగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలు కూడా ఈ వేరియంట్‌పై పనిచేయకపోవచ్చిన అనుమానిస్తున్నారు. ఈ వేరియంట్ అత్యధిక జెనెటిక్ మ్యుటేషన్లు కలిగి ఉండటం, డెల్టా కన్నా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైతే ఒమిక్రాన్‌తో మరణం సంభవించిన దాఖలా లేదు. అయితే ఒమిక్రాన్ స్వభావంపై సరైన అంచనా లేకపోవడంతో.. అది ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందోనన్న భయాందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి బుధవారం ఢిల్లీకి వచ్చిన వారికి కోవిడ్ టెస్ట్ లు నిర్వహించగా.. యూకే ,నెదర్లాండ్స్ నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్ గా తేలింది. ఆమ్‌స్టర్‌డామ్, లండన్ నుంచి మొత్తంగా నాలుగు విమానాల్లో 1,013 మంది ప్రయాణికులు ఢిల్లీకి చేరుకోగా.. వారిలో నలుగురికి కొవిడ్​ పాజిటివ్​గా తేలిందని అధికారులు తెలిపారు. వీరి నమూనాల్లో కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ఉండొచ్చనే అనుమానంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. వైరస్​ సోకిన నలుగురు భారతీయులేనని అధికారులు తెలిపారు. ఈ నలుగురిని ఢిల్లీలోని ఎల్​ఎన్​జేపీ హాస్పిటల్ లో చేర్పించారు. మిగతా రోగులతో కలవకుండా ఉండేలా వారి కోసం ప్రత్యేకంగా ఓ ఐసోలేషన్​ వార్డును ఏర్పాటు చేశారు.

యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్​వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్​, ఇజ్రాయెల్‌లతో పాటు మరికొన్ని యూరప్ దేశాలను కేంద్రం ‘ఎట్​ రిస్క్(ప్రమాదం పొంచి ఉన్న)’ దేశాలుగా గుర్తించింది. ఈ దేశాల నుంచి ప్రయాణికులు భారత్​కు చేరుకుంటే.. కేంద్రం సూచించిన అదనపు జాగ్రత్తలను పాటించాలి. కొత్త నిబంధనల ప్రకారం.. ‘ఎట్​ రిస్క్​’ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం. ఫలితం వచ్చే వరకు వారు విమానాశ్రయం వదిలి పెట్టకూడదని షరతు విధించింది. నెగెటివ్ వస్తే ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. కేంద్రం తాజాగా వెల్లడించిన కోవిడ్ మార్గదర్శకాలు మంగళవారం అర్ధరాత్రి దాటిన నుంచి అమల్లోకి వచ్చాయి.

ALSO READ Omicron Threat : మహారాష్ట్రలో టెన్షన్..రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా