Omicron : ఎయిర్ పోర్టులో ఒక్క యాంటీజెన్​ టెస్ట్​ రూ.4,000 వసూలు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు క్రమంలో ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా..చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్క యాంటీజెన్​ టెస్ట్​ రూ.4 వేలు వసూలు చేస్తున్నారు

Omicron : ఎయిర్ పోర్టులో ఒక్క యాంటీజెన్​ టెస్ట్​ రూ.4,000 వసూలు

Omicron Antigen Test Rs 4,000 Charge

Omicron Antigen Test Rs 4,000 charge : ఒకోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఇండియా సైతం కొత్త ఆంక్షలు విధించింది. కేంద్రం విధించిన కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి ముఖ్యంగా సౌతాఫ్రికా నుంచి వస్తున్న వారికి ఎయిర్ పోర్టుల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. ప్రయాణీకులు ర్యాపిడ్ PCR లేదా RT-PCR పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో టెస్టు కోసం విదేశీ ప్రయాణికులు క్యూ కట్టారు. రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లోనూ ర్యాండమ్ గా 2 శాతం మందిని ఎంపిక చేసి టెస్టులు చేస్తున్నారు.

Read more :Omicron : సౌతాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన వందల మంది అడ్రస్ లేరు..

దీంతో ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో కరోనా టెస్టుల కోసం ఆరు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఉదయం నుంచి ఇప్పటిదాకా నాలుగు ముప్పున్న దేశాల నుంచి 1,013 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ యాంటీ జెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. టెస్టులు చేయించుకుని తీరాలన్న నిబంధన ఉందిగానీ..కచ్చితంగా ఇదే టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన మాత్రం లేదు. ప్రయాణికులకు నచ్చిన టెస్టునే చేస్తున్నారు. ఈక్రమంలో పనిలో పనిగా వసూళ్ల దందాలా తయారైంది టెస్టులకు వసూలు చేస్తున్న తీరు చూస్తుంటే. తక్కువ ధర ఉన్న యాంటీ జెన్ టెస్టులకు భారీ ధరను వసూలు చేస్తున్నారు. ఒక్కో టెస్టుకు రూ.3,900 చార్జ్ చేస్తున్నారు. టెస్టు కోసం..దాదాపు మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది.దీంతో ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు.

Read more : Omicron Threat : ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన నలుగురికి కరోనా

అదే ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం రూ.500గా చార్జీని నిర్ణయించారు. ఈ టెస్టు కోసం ఐదారు గంటల పాటు ప్రయాణికులు లైన్లలో నిలబడి వెయిట్ చేస్తున్నారు. ముప్పున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇది తప్పనిసరి అని స్పష్టంచేసింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వారంటైన్ లో ఉన్నప్పుడు రెండో రోజు, నాలుగో రోజు, ఏడో రోజు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని తప్పనిసరి చేసింది.

Read more :WHO : ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దు..దక్షిణాఫ్రికాను శిక్షించొద్దు

ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిందని..అది ఒమిక్రానా? లేదా సాధారణ కోవిడా? అనేది తేల్చేందుకు జీనోమ్ టెస్టింగ్ కోసం పంపినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాంటాక్ట్ లను ట్రేస్ చేసేందుకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వెల్లడించింది.చెన్నై ఎయిర్ పోర్టులో దిగిన 88 మందికి టెస్టులు చేయగా.. నెగెటివ్ వచ్చింది. దీంతో ప్రయాణీకులతో పాటు అధికారులు కూడా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అలాగే కొంతమందికి పాజిటివ్ వస్తే ఆందోళన మొదలవుతోంది. ఇక పోతే..ఎయిర్ పోర్టుల్లో టెస్టుల నిర్వహణలో భాగంగా..చెన్నైలో ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.900, యాంటీ జెన్ టెస్టుకు రూ.4,000 దాకా వసూలు చేస్తున్నారు. కాగా, వెయిట్ టైంను తగ్గించేందుకు ప్యాసింజర్లు ముందుగానే టెస్టును బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.