WHO : ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దు..దక్షిణాఫ్రికాను శిక్షించొద్దు

ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ఒక మరణం సంభవించలేదని, ప్రస్తుతం ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ఈ వైరస్ ను నియంత్రించగలదా ?

WHO : ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దు..దక్షిణాఫ్రికాను శిక్షించొద్దు

Who

Omicron Virus : ఒమిక్రాన్ పై అతిగా స్పందించొద్దని..దక్షిణాఫ్రికాను శిక్షించొద్దని ప్రపంచ దేశాలకు సూచించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. అప్పుడే కొన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయని..దీనివల్ల వైరస్ ను నియంత్రిస్తామా అని ప్రశ్నించారు. కఠిన నిబంధనలు, ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒక్కవిధంగా.. పరిస్థితులు మరింతగా దిగజారుతాయన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ఒక మరణం సంభవించలేదని, ప్రస్తుతం ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ఈ వైరస్ ను నియంత్రించగలదా ? అనేదానిపై సమాధానం లేదని..దీని గురించి అన్వేషించాల్సి ఉందన్నారు.

Read More : Omicron Threat : మహారాష్ట్రలో టెన్షన్..రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. పలు దేశాల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో కొన్ని దేశాలు కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికాకు రాకపోకలపై నిషేధం విధించాయి. విదేశాల నుంచి వచ్చిన వారిపై ఆంక్షలు పెడుతున్నాయి. ఈ క్రమంలో..డబ్ల్యూ హెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ స్పందించారు.

Read More : Parag Agrawal : ట్విట్టర్ కొత్త సీఈవో జీతం ఎంతో తెలుసా ? కళ్లు చెదిరిపోతుంది

కఠిన ఆంక్షలు అవసరం లేదని దేశాలకు సూచించారు. ప్రజలను కాపాడుకోవాలని కొన్ని దేశాలు ఈ విధంగా స్పందిస్తున్నాయని తాము అర్థం చేసుకున్నామని..ఒమిక్రాన్ పై ఇంకా పూర్తి అవగాహన రాలేదన్నారు. ఈ విషయంలో పూర్తిగా తెలియకముందే…దక్షిణాఫ్రికాపై ఆంక్షలు విధించొద్దని సూచించారు. ఈ వైరస్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న దక్షిణాఫ్రికా, బోట్సావానా దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.