Andhra Pradesh Covid : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 110 కేసులు

ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ..మరలా రెండు రోజుల నుంచి కేసులు పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి.

Andhra Pradesh Covid -19 cases : ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ..మరలా రెండు రోజుల నుంచి కేసులు పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి.

తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 8 వేల 110 మందికి కరోనా సోకింది. 67 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 99 వేల 057 యాక్టివ్ కేసులు ఉండగా..11 వేల 763 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో 1 416 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,84,988 పాజిటివ్ కేసు లకు గాను 16,74,168 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11,763 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 99,057గా ఉంది.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :- 
చిత్తూరులో 11 మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, విశాఖలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, కృష్ణాలో నలుగురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు, నెల్లూరులో ఒక్కరు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 906. చిత్తూరు 1042. ఈస్ట్ గోదావరి 1416. గుంటూరు 512. వైఎస్ఆర్ కడప 508. కృష్ణా 576. కర్నూలు 235. నెల్లూరు 280. ప్రకాశం 600. శ్రీకాకుళం 461. విశాఖపట్టణం 502. విజయనగరం 280. వెస్ట్ గోదావరి 792. మొత్తం : 8110

Read More : CM Jagan Delhi Tour : ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ..

ట్రెండింగ్ వార్తలు