Chandrababu Naidu : సాయంత్రం 5.30గంటలకు ద్రౌపది ముర్ముతో భేటీకానున్న చంద్రబాబు

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఏపీలో పర్యటించనున్న ద్రౌపది ముర్ముతో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. సాయంత్రం 5.30గంటలకు ద్రౌపది ముర్ముతో చంద్రబాబు సమావేశంకానున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

Chandrababu Naidu: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఏపీలో పర్యటించనున్న ద్రౌపది ముర్ముతో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. సాయంత్రం 5.30గంటలకు ద్రౌపది ముర్ముతో చంద్రబాబు సమావేశంకానున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో తన స్టాండ్‌ను టీడీపీ ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు.ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో అధికారికంగా ప్రకటించారు. ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు విష‌యంపై టీడీపీ స్ట్రాట‌జీ క‌మిటీ భేటీ అయి ద్రౌపది ముర్ముకే మద్దతు ప్రకటించాని నిర్ణయం తీసుకుంది. సామాజిక న్యాయానికే తొలి నుంచి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే దళిత నేతకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

కాగా..విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. దీంతో ఈఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ఎన్డీయే అభ్యర్థికి టీడీపీ మద్దతు తెలపడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. 2017 తర్వాత వచ్చిన అభిప్రాయబేధాలతో టీడీపీ ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఆతర్వాత బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోంది.

Also read : Draupadi Murmu : నేడు ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము రాక

ఈక్రమంలో 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు..బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసేందుకు విపక్షాలన్నీ ఏకమవుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. మరోసారి టీడీపీ,బీజేపీ,జనసేన కలిసి పోటీ చేస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో చంద్రబాబు నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది.

మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు చేరుకోనున్న ద్రౌపది ముర్ముతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతారు. తనకు మద్దతివ్వాలని జగన్‌ను కోరనున్నారు ముర్ము. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్‌ ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఇస్తారు. అటు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విషయంలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు