×
Ad

Social Media Ban : ఏపీలో త్వరలో సోషల్ మీడియా బ్యాన్..! ఆస్ట్రేలియా మాదిరి చట్టంకు కసరత్తు?

Social Media Ban : చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Andhra Pradesh

Social Media Ban : ఏపీలో సోషల్ మీడియాను బ్యాన్ చేసేందుకు కూటమి ప్రభుత్వం త్వరలో చట్టం తేబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ స్వయంగా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి అలాంటి విధానం ఏదీ లేదు. కానీ, భవిష్యత్తులో మాత్రం ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.

Also Read : Gold and Silver Rates Today : ఓరి దేవుడా.. రాత్రికిరాత్రే సీన్ రివర్స్.. ఏకంగా రూ.20వేలు.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు..

ఆస్ట్రేలియాలో 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడకుండా నిషేధం విధించారు. పిల్లలు సోషల్ మీడియాను అతిగా వినియోగించడం వలన శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రభావితం అవుతున్నారు. దీనిని గమనించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించింది. ఆస్ట్రేలియా తరహాలో ఏపీలోనూ ఇలాంటి చట్టం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ఏపీ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో ఉన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోర్ (డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొన్న మంత్రి.. బ్లూమ్‌బర్గ్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అన్నారు.

ఒక రాష్ట్రంగా మేము ఆస్ట్రేలియా యొక్క అండర్-16 చట్టాన్ని అధ్యయనం చేస్తున్నాం. బలమైన చట్టపరమైన చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. 16ఏళ్ల వయస్సు కంటే తక్కువ వయస్సు కలిగిన యువకులు సోషల్ మీడియాలో ఉండకూడదని నేను గట్టిగా భావిస్తున్నాను. ఎందుకంటే.. వాళ్లు సోషల్ మీడియా కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉందని, వారి భద్రత దృష్ట్యా బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరమవుతుందని లోకేశ్ తెలిపారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బేనిస్ ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వం 16ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేస్తూ 2025 డిసెంబర్ నెలలో చట్టం చేసింది. టిక్ టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తోపాటు పలు సైట్స్, యాప్స్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం బ్యాన్ చేసింది. అంటే పిల్లలు తమ పేరుతో కొత్త అకౌంట్స్ తీసుకోలేరు. అంతేకాకుండా ప్రస్తుతానికి వారికి ఉన్న అకౌంట్లు కూడా డీయాక్టివేట్ అవుతాయి. ఇలాంటి తరహా చట్టాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకొచ్చేలా ఆలోచన చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ చెప్పారు.