Dwarka Tirumala : ద్వారకాతిరుమల కొండపై టోల్ దందా.. మూడేళ్లలో రూ.30 లక్షలు దోచేసిన కాంట్రాక్టర్

ద్వారకాతిరుమల కొండపై టోల్ గేట్ వసూళ్ల దందా బయటపడింది. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా మూడేళ్లలో రూ.30 లక్షలు దోచేశాడు ఆలయ సిబ్బంది సహకారంతో.,

toll collection scam On dwarka tirumala : భగవంతుడిని భక్తుడు దర్శించుకోవాలంటే ఎంతోమంది కేటుగాళ్లను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్వారకాతిరుమల కొండపై అదే జరుగుతోంది. టోల్ పేరుతో ద్వారకాతిరుమలేశుడిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తులను దోచేస్తున్నారు. కొండపైకి వెళ్లాలంటే టోల్ కట్టాల్సిందే. అలా అక్రమంగా టోల్ వసూళ్లతో కోట్లు దోచేస్తున్నారు కాంట్రాక్టర్లు. చిన్నవెంకటేశ్వరస్వామిగా పేరొందిని ద్వారకతిరుమలేశుడు కొలువైన కొండపైకి వాహనం వెళ్లాలంటే టోల్ కట్టాల్సిందే. అలా టోల్ పేరుతో కాంట్రాక్టర్ మూడేళ్లలో రూ.30 లక్షలు దోచేసిన వైనం బయటపడింది.టోల్ ఫీజు కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా మార్చేసి వసూలు చేస్తున్నారు.

టోల్ రుసుం వసూలు చేసే కాంట్రాక్టర్ అక్రమంగా టోల్ వసూలు చేస్తున్న బాగోతం బయటపడింది. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులోని టోల్ గేట్ వద్ద భక్తుల వాహనాలకు రుసుములు వసూలు చేసే నిమిత్తం 2020 జనవరి 27న దేవస్థానం బహిరంగ వేలం, సీట్ టెంటర్లను నిర్వహించింది. దీంట్లో భాగంగా ఒక కాంట్రాక్టర్ సీల్ టెంటర్ ద్వారా రూ.1.30,53,777లకు టోల్ వసూలు చేసుకునే హక్కును దక్కించుకున్నాడు.

కానీ కరోనా నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ టోల్ రుసులు వసూలు చేపట్టలేదు. దీంతో 2021 అక్టోబర్ 14వరకు దేవస్థానమే టోల్ వసూళ్లను సొంతంగా నిర్వహించింది. ఇక టోల్ గేట్ ను దేవస్థానమే నిర్వహించాలనే ఉద్ధశంతో కారు, జీపు, వ్యాను టోల్ ధరను రూ.30 నుంచి రూ.50కు ఆటోకు రూ.10నుంచి 25కు పెంచుతూ 2021 ఆగస్టులో ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈక్రమంలో సదరు కాంట్రాక్టరు 2021 అక్టోబర్ లో 15న టోల్ గేట్ వసూళ్లకు దిగాడు. కానీ టెండర్ లో విధించిన షరతుల్లో ధరలు కాకుండా తన ఇష్టానుసారంగా వసూళ్లకు దిగాడు. అలా ఏడాదిపాటు అక్రమంగా వసూళ్లు చేశాడు. దేవస్థఆనం అధికారులు, సిబ్బంది సహకారంతోనే కాంట్రాక్టర్ ఇదంతా చేస్తున్నాడని ప్రస్తుత దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు గుర్తించారు. దాంతో సదరు కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశాడరు. నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.27 లక్షలను దేవస్థానికి చెల్లించాలని నోటీసులో పేర్కొంటూ ఆదేశించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు