Andhra pradesh : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను తండ్రితో కలిసి చంపి .. హార్ట్‌ఎటాక్ అని డ్రామా

డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చంపిన భార్య కథ బయటపడింది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా తండ్రితో కలిసి భార్యే హత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు.

Andhra pradesh Crime

Andhra pradesh : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారి విజయ్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. విజయ్ గుండెపోటుతో మరణించలేదు హత్య చేయటం వల్లే మరణించాడని నిర్ధారించారు. భార్యే విజయ్ ను చంపి గుండెపోటుగా చిత్రీకరించింది అంటూ తేల్చారు. విజయ్ భార్య ప్రీతి తన తండ్రి శంకర్రావుతో కలిసి భర్తను చంపి గుండెపోటు అంటూ ఆస్పత్రిలో చేర్పించిందని చికిత్స పొందుతు మరణించినట్లుగా క్రియేట్ చేసింది అని పోలీసులు తెలిపారు.

అల్లూరి జిల్లాలోని జి.మాడుగుల మండలం నేరోడివలసకు చెందిన హరి విజయ్‌.. ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ చివుకుచింతకి చెందిన ప్రీతిని 2014లో హరి విజయ్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. చోడవరంలోని మారుతీనగరంలో నివసించే వీరికి ఓ పాప జన్మించింది. వీరిద్దరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరికి డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

ఈక్రమంలో ప్రీతి తన భర్త విజయ్ కు గుండెపోటు వచ్చిందంటూ ఏప్రిల్ 18న పాడేరు ఆస్పత్రిలో చేర్పించింది. ఆ తరువాత చికిత్స పొందుతు చనిపోయాడని క్రియేట్ చేసింది. కానీ దీనిపై విజయ్‌ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తులో మరిన్ని అనుమానాలు వచ్చాయి. విజయ్‌‌కు గుండెనొప్పి అంటూ భార్య ప్రీతి కారులో పాడేరు తీసుకురావడంతో పోలీసులు అనుమానం మరింతగా పెరిగింది. దీంతో విజయ్ భార్య ప్రీతి కాల్‌ డేటాను సేకరింటంతో అసలు విషయాలు బయటకొచ్చాయి.

ఫైనాన్స్‌ వ్యాపారం విషయంలో విజయ్, ప్రీతీ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఏకంగా భర్త విజయ్‌ను చంపాలని ప్లాన్ వేసేవరకు వెళ్లాయి. ప్రీతి తండ్రితో పాటూ మరో ఐదుగురితో కలిసి విజయ్ ను చంపటానికి ప్లాన్ వేశారు. దీంట్లో భాగంగా విజయ్‌కు మద్యం తాగించారు.. మత్తులో ఉన్న అతడి మొహంపై దిండుతో అదిమి హత్య చేశారు. ఆ మరుసటి రోజు విజయ్‌కు గుండెపోటు వచ్చిందంటూ ప్రీతీ కారులోస్వయంగా తీనే డ్రైవ్ చేసుకుంటు తీసుకొచ్చి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. ఆ తరువాత చికిత్స పొందుతు చనిపోయాడని డ్రామాలాడారు.కానీ కథ వారు అనుకున్నట్లుగా కాకుండా విజయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో భార్య ప్రీతి అడ్డంగా బుక్కైంది.

ప్రీతి డబ్బు కోసం విజయ్‌ను చంపింది అని పోలీసుల విచారణలో తేల్చారు.. విజయ్‌ అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు..ఈకేసులో ప్రధాన నిందితురాలు ప్రీతి ఆమె తండ్రి శంకరరావును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును పాడేరు నుంచి చోడవరం పీఎస్ కు అప్పగించారు మరింత దర్యాప్తు కోసం. ఈకేసులో నిందితులు అనకాపల్లి జిల్లాకు చెందిన వారు కావటంతో చోడవరం సర్కిల్‌కు బదిలీ చేశారు మరింత దర్యాప్తు కోసం. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనేవ వారిని అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు.