Andhra Woman : చనిపోయిన భర్తకు గుడి కట్టిన భార్య.. నిత్యం పూజిస్తోంది!

ఆదర్శ మహిళ.. భర్తంటే ఎంతో ప్రేమ.. భర్త మరణించినా అతడ్ని ఆమె మరిచిపోలేదు. ఏకంగా భర్తకు గుడి కట్టేసింది. నిత్యం పూజలు చేస్తోంది.

Andhra Woman : చనిపోయిన భర్తకు గుడి కట్టిన భార్య.. నిత్యం పూజిస్తోంది!

Andhra Woman Builds Temple For Dead Husband, Video Goes Viral

Updated On : August 15, 2021 / 9:12 PM IST

woman builds temple for dead husband : ఆదర్శ మహిళ.. భర్తంటే ఎంతో ప్రేమ.. భర్త మరణించినా అతడ్ని ఆమె మరిచిపోలేదు. ఏకంగా భర్తకు గుడి కట్టేసింది. అంతటితో ఆగలేదు.. పతియే ప్రత్యక్ష దైవమంటూ నిత్యం పూజలు చేస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరంకు చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. భర్త అంకిరెడ్డిని గుర్తు చేసుకుంటూ కాలం గడిపేస్తూ వచ్చింది. తన భర్తకు గుర్తుగా ఏదైనా చేయాలనుకుంది. 11ఏళ్ల తమ వైవాహిక జీవితానికి గుర్తుగా భర్త విగ్రహాంతో పాలరాతితో గుడిని నిర్మించింది. ఆ గుడిలో భర్త విగ్రహానికి ప్రతిరోజూ పూజలు చేస్తోంది. అలా ఆదర్శ ఇల్లాలుగా మారింది ఈ మహిళ.

భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతో కుమారుడు శివశంకర్‌ రెడ్డితో కలిసి సమాజ సేవకులను సన్మానిస్తున్నారు. ప్రతి పౌర్ణమికి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తూ అందరికి ఆమె ఆదర్శంగా నిలుస్తోంది. పతియే ప్రత్యక్ష దైవం అంటారుగా పెద్దలు.. బహుషా ఈ ఇల్లాలు ఇదే సూత్రాన్ని పాటిస్తోందంటున్నారు. మహిళ భర్త విగ్రహానికి పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలా చనిపోయిన భాగస్వామికి భారీ విగ్రహాలు నిర్మించడం తొలిసారి కాదు.. గత ఏడాది ఆగస్టులో కర్ణాటక వ్యాపారవేత్త కూడా తన చనిపోయిన భర్త గౌరవార్థం భారీ విగ్రహాన్ని నిర్మించాడు. తన డ్రీమ్ హోమ్ లో భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశాడు. అప్పుడా ఆ వీడియో కూడా వైరల్ అయింది.