Perni Nani slams Pawan Kalyan: బీజేపీతో పవన్ కల్యాణ్ తెగదెంపులు చేసుకుంటున్నారు: పేర్ని నాని

వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో పవన్ కల్యాణ్ తెగదెంపులు చేసుకుంటున్నారని చెప్పారు. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ రాజకీయ ముఖ చిత్రం మారుతోందన్నారని, అంటే ఆయన చంద్రబాబుతో కలిసి వెళ్తారని ఆరోపించారు. చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడానికి పవన్ కల్యాణ్ కు సమయం దగ్గరపడిందని చెప్పారు.

Perni Nani

Perni Nani slams Pawan Kalyan: వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో పవన్ కల్యాణ్ తెగదెంపులు చేసుకుంటున్నారని చెప్పారు. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ రాజకీయ ముఖ చిత్రం మారుతోందన్నారని, అంటే ఆయన చంద్రబాబుతో కలిసి వెళ్తారని ఆరోపించారు. చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడానికి పవన్ కల్యాణ్ కు సమయం దగ్గరపడిందని చెప్పారు.

ఈ ఈవెంటును చంద్రబాబుకు అందించడమే పవన్ కల్యాణ్ లక్ష్యమని ఆరోపించారు. దత్తపుత్రుడి ముసును నేటితో తొలగిపోయిందని అన్నారు. ఇవాళ పవన్ కల్యాణ్ ముసుగు తీయడం సంతోషమని ఆయన చెప్పారు. గూండాలు ఉన్నది జనసేనలోనేనని, వైసీపీలో కాదని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కాపులు వైసీపీకి అండగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా అండగా ఉంటారని పేర్ని నాని చెప్పారు. కాపుల్లో అత్యధిక శాతం మంది సీఎం జగన్ తోనే ఉన్నారని ఆయన అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..