Ap Illegal Mining Of Precious Stones (1)
Ap Illegal Mining of Precious Stones : ఏపీలోని కర్నూలు జిల్లాలో తొలకరి పలకరిస్తే చాలు వజ్రాల వేట మొదలవుతుంది. వాన చినుకు భూతల్లిని ముద్దాడితే చాలు మట్టిలోంచి మాణిక్యాలు మిలమిలా మెరుస్తు కూలీలను సైతం కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. పుడమితల్లి తన గర్భంలో దాచిపెట్టిన వజ్రాలకు బడుగు జీవులకు అందిస్తుంది. అలా ఎంతోమంది తమ అదృష్టాన్ని పరిక్షించుకోవటానికి పొలాలవెంట కోటి ఆశలతో కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ వజ్రాలకోసం వెతుకుతారు.
దాదాపు అటువంటి రంగురాళ్లంటే వేటకు ప్రసిద్ధి విశాఖ ఏజెన్సీ ప్రాంతం. విశాఖలోని నర్సీపట్నం ప్రాంతాలు ఈ రంగురాళ్లకు నిలయాలుగా అలరారుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విలువైన వైఢూర్యాలు ఈ ప్రాంతాల్లోనే లభ్యమవుతున్నాయి. దీనికి ఆరంబం వర్షాలు కురిస్తే చాలు మొదలైపోతాయి. గత నెల రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మూసివేసిన క్వారీలన్నీ తెరుచుకుంటాయి. సందడి మొదలైపోతుంది. అలా మూసివేసిన క్వారీలు తవ్వకాలకు అనువుగా మారడంతో అందరూ దృష్టీ దీనిపై పడింది.
Read more : రూ.200ల లీజు భూమిలో రైతుకు దొరికిన 14.98 క్యారెట్ల వజ్రం..ధర రూ.60 లక్షలు
నెలరోజుల క్రితం సాక్షాత్తూ డీఎఫ్‌వో డ్రైవర్ ఆధ్వర్యంలో కొంతమంది రంగురాళ్ల తవ్వకాలకు యత్నించి దొరికిపోయారు. అయినా ఈ వేట మాత్రం మానేది లేదంటారు కొంతమంది. అలా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సిగనాపల్లి, మేడూరు, గుర్రాలగొందిల్లో క్వారీలలో తవ్వకాలు కొనసాగిస్తునే ఉన్నారు. ఏమో ఒక్క వజ్రం దొరికితే చాలా కోటీశ్వరులైపోవచ్చనే ఆశ ఈ తవ్వకాలు కొనసాగేలా చేస్తోంది. రంగురాళ్ల వ్యాపారానికి నర్సీపట్నం కేంద్రంగా మారటంతో అందరి చూపు ఇటువైపే పడుతోంది. అలా గత వారం రోజుల్లో జరిగిన తవ్వకాల్లో దొరికిన వజ్రాలతో దాదాపు రూ.5 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవి అక్రమ తవ్వకాలే అయినా ఫారెస్టు అధికారులు, పోలీసులు చూసీచూడనట్లుగ..తెలిసీ తెలియనట్లుగా ఉంటారు. దీంతో వ్యాపారులు రంగురాళ్ల తవ్వకాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఈ తవ్వకాలకు స్థానిక రాజకీయ నాయకుల అండకూడా ఉండటంతో అధికారులు నోరు మెదపరనే అంటుంటారు. అలా ఈ తవ్వకాల్లో లభ్యమైన రంగురాళ్లు వ్యాపారుల్ని కోట్లకు పడగలెత్తేలా చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే స్థానిక కృష్ణాబజార్ ప్రాంతంలో ఒక రంగురాళ్ల వ్యాపారి ఇల్లే నిదర్శనంగా. ఈ వ్యాపారానికి ఈయనగారి ఇల్లే కేంద్రంగా మారింది.
కోట్లు కురిపించే క్వారీలు..
విశాఖ ఏజెన్సీ తూర్పు కనుమల్లోని గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలో లభించే ఆకుపచ్చ వైఢూర్యాలకు విదేశాల్లో ఫల్ డిమాండ్ ఉంది. ఒక్క వైడూర్యం దొరికి పంట పండినట్లే. ముఖ్యంగా పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి, గుర్రాలగొంది, మేడూరు క్వారీల్లో లభించే క్యాట్స్ ఐ రకాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రంగురాళ్ల తవ్వకాలకు మంచి ఊపునిస్తున్నాయి. నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు సమీప గ్రామాల్లోని కొంతమందికి డబ్బులు ఇచ్చి పప్పుశెట్టిపాలెం లీజు క్వారీకి సమీపంలో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు చేన్నారు. జీకే వీధి మండలం సిగనాపల్లిలో కూడా రంగురాళ్ల తవ్వకాలు ముమ్మరంగా సాగిస్తున్నారు.
తవ్వకాల్లో పొంచి ఉండే ప్రమాదాలు..మట్టిలో కలిసిపోతున్న ప్రాణాలు..
పప్పుశెట్టిపాలెం క్వారీలో ముమ్మరంగా తవ్వకాలు జరపడంతో 1992–93లో క్వారీ కూలి 15 మంది మృతి చెందారు. అలాగే కరకలో రంగురాళ్ల క్వారీ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదాలతో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో స్థానిక పోలీసు అధికారులు కాస్త అప్రమత్తమయ్యారు. తవ్వకాలు జరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అప్పటి నుండి కరక, పప్పుశెట్టిపాలెం ప్రాంతాల్లో తవ్వకాలు ఆగిపోయాయి. కానీ కాలం గడిచేకొద్దీ మార్పులు సహజం అన్నట్లుగా అక్కడి పరిస్థితులు మరోసారి తవ్వకాలు మొదలుపెట్టేలా చేశాయి. ఇటీవల పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి క్వారీలో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న రంగురాళ్లను నర్సీపట్నం తరలిస్తు..అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా కొనసాగిస్తున్నారు.
Read more : El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ తయారీ ఘనత
నర్సీపట్నానికి చెందిన వ్యాపారి దీంట్లో కీలకపాత్ర వహిస్తున్నారు. విశాఖపట్నంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా ఈ వ్యాపారి వద్దకే వచ్చి రంగురాళ్లు కొంటున్నారు. రెండు కోట్ల రూపాయలకు వ్యాపారం జరిగింది. ఈ రంగురాళ్ల వ్యాపారుల ధన దాహనికి బడుగు జీవుల ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయి. క్వారీలు కూలి అమాయక కూలీల ప్రాణాలు పోతున్నాయి. అయానా కూలిడబ్బుల కోసం తవ్వకాలకు వెళుతునే ఉంటారు. కానీ తవ్వకాలు మాత్రం ఆగటంలేదు. రాజకీయ నాయకుల అండతోను..ఉన్నతాధికులు పట్టించుకోకపోవటంతో ఈ తవ్వకాలు నిరాటంకంగా జరిగిపోతుంటాయి. రంగురాళ్ల తవ్వకాలు ఆపాలని ఎంతమంది డిమాండ్ చేసినా ఏ అధికారి పట్టించుకునే పరిస్థితి లేదు.
తవ్వకాలు జరిపితే ఉరుకునేది లేదని పోలీసులు అంటునే ఉంటారు.మరోపక్క అక్రమ తవ్వకాలు జరుగుతునే ఉంటాయి. కూలీల ప్రాణాలు పోతునే ఉంటాయి. కానీ ఈ అక్రమాలకు అడ్డుకట్టమాత్ర పడటంలేదు. రంగురాళ్ల తవ్వకాల్లో పోతున్న బడుగు జీవుల ప్రాణాలకు భద్రతలేదు.దానికి గురించి ఆలోచించే కోరిక..తీరిక ఎవ్వరికీ లేదు. తవ్వకాలు జరగాలి..కాసులు కురవాలి అంతే..