అనస్థీషియా వైద్యుడు సుధాకర్‌ అకాల మరణం

విశాఖలో N95 మాస్కులు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించి జైలుపాలైన అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్‌ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు రావడంతో

doctor sudhakar :విశాఖ ఆసుపత్రులలో వైద్యులకు N95 మాస్కులు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించి జైలుపాలైన అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్‌ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు రావడంతో విశాఖలోని కింగ్‌ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్టు తెలుస్తోంది. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. గతేడాది నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు పంపిణీ చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని తీవ్రంగా తూర్పారబట్టారు. దానికి తోడు సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీని, సీఎం జగన్ అసభ్య పదజాలంతో దూషించారు.

ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత తన తప్పు తెలుసుకున్న సుధాకర్ సీఎం జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా వేడుకున్నారు. అయితే కొద్దిరోజులు గడిచిన తర్వాత ఆయన గుండెపోటుతో మృతిచెందడం బాధాకరం. ఇక సుధాకర్‌ మృతిపట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన కక్షసాధింపు చర్యలకు ఆయన బలయ్యారని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు