Annamayya Project : జలవిలయం.. వరద ఉధృతికి తెగిన అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట

కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Annamayya Project : కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. వరద ఉదృతి అధికంగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాలతో కడప నగరం జలమయమైంది..భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్ళల్లోకి వచ్చి చేరింది. నగరంలోని రహాదార్లపై ప్రమాదకర స్థాయిని మించి వరద నీరు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. నగరంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ..ఇళ్లలోకి నీరు చేరడంతో తిండి తిప్పలు లేక ప్రజలు నానావస్థలు పడుతున్నారు.

చదవండి : Tirupati Rains : తిరుపతిలో కుండపోత వాన.. భక్తులు ఉరుకులు పరుగులు, స్తంభించిన జనజీవనం

వర్షాల తీవ్రతకు జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేరుతుండటంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పింఛా డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటి ఉధృతికి రింగ్ బండ్ తెగిపోయింది. ఊహకు అందని స్థాయిలో అన్నమయ్య ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి. ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఊహించని స్థాయిలో నీరు వస్తుడటంతో కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు లోతట్టు ప్రాంత వాసులు

చదవండి : Heavy Rains In Kadapa : కడప జిల్లాలో భారీ వర్షాలు.. వరద నీటిలో చిక్కుకున్న వాహనాలు

గతంలో ఇలానే వరదలు వచ్చిన సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి.. అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతం అయింది.. కానీ ఈ సారి మట్టికట్ట తెగిపోయింది. భారీ వర్షాలతో వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కడప జిల్లాలో 11 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు. ఇక పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. తడిచిన వరి, వేరుశనగ, బుడ్డశనగ..ధాన్యానికి మొలకలెత్తడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది.

చదవండి : Heavy Rains : నెల్లూరు జిల్లాలో వర్ష బీభత్సం…వాగులో కొట్టుకుపోతున్న విద్యార్థిని కాపాడిన తోటి విద్యార్థులు

నెల్లూరు జిల్లా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతుంది. జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. చెరువులు కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని సోమశిల జలాశయానికి 3,90,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీనితో 11 గేట్లు నుండి పెన్నానది దిగువకు 4,08,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పెన్నానది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఈ నది పరివాహక ప్రాంతాలను అలెర్ట్ చేస్తున్న అధికారులు.. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 71.07 టీఎంసీలకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు