Heavy Rains : నెల్లూరు జిల్లాలో వర్ష బీభత్సం…వాగులో కొట్టుకుపోతున్న విద్యార్థిని కాపాడిన తోటి విద్యార్థులు

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరిలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

Heavy Rains : నెల్లూరు జిల్లాలో వర్ష బీభత్సం…వాగులో కొట్టుకుపోతున్న విద్యార్థిని కాపాడిన తోటి విద్యార్థులు

Nellore

Heavy rains in Nellore district : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి పట్టణాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. ఉధృతంగా వాగు ప్రవహిస్తున్నా కొంతమంది విద్యార్థులు పట్టించుకోకుండా వాగు దాటే ప్రయత్నం చేశారు. దీంతో ఒక విద్యార్థి పట్టుతప్పి వరద ప్రవాహంలోకి జారిపోయాడు. కొట్టుకుపోతున్న ఆ విద్యార్థిని తోటి విద్యార్థులు కాపాడారు.

Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలంలోని కలుజు వాగు, నక్కల వాగు, బీరా పేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మర్రిపాడు మండలంలోని కేతామన్నారు, బొగ్గేరు, అనంతసాగరం మండలంలోని కొమ్మలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగుల ఉధృతికి ఆత్మకూరు ఏఎస్‌పేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

మర్రిపాడు మండలంలోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మర్రిపాడులోని లోతట్టుప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇళ్లు, స్కూళ్లను వరదనీరు ముంచెత్తింది. భారీ వర్షాలతో మర్రిపాడు, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల్లో పొగాకు, వరి నారుమడులు, మిరప, బొప్పాయి తోటలు నీటమునిగాయి.