Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది.

Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

Ap Rains

cyclone in the Bay of Bengal : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాయుగుండం రేపు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. రేపు తెల్లవారుజామున…చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.

వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో.. తిరుపతి జలమయమైంది. తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో హైవేపైకి వరద ప్రవాహం పోటెత్తింది. దక్షిణ కోస్తాంధ్ర సముద్ర తీరప్రాంతం గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

CM Jagan : మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్ స్టేషన్లు : సీఎం జగన్

తిరుమల, తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. రహదారులు నీటమునిగాయి. తిరుపతి బస్టాండ్ నీటమునిగింది. పలు బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో కుండపోతగా వర్షం పడింది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఎయిరిండియా విమానం గంటపాటు గాల్లో చక్కర్లు కొట్టి.. తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. ల్యాండ్‌ కాకుండా హైదరాబాద్‌ తిరిగెళ్లిపోయాయి. కుండపోత వర్షానికి కపిలతీర్థం ఉధృతంగా జాలువారుతోంది. తిరుమల గిరుల్లో కురిసిన వర్షాలకు…మట్టితో వరద నీరు కిందకు పడుతోంది.

AP New Scheme : ఏపీలో మరో కొత్త పథకం

మరోవైపు హరిణి సమీపంలో రెండవ ఘాట్‌రోడ్డుపైకి జారిపడిన కొండ చరియలు జారిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలను ఇబ్బంది లేకుండా బ్యారికేడ్లు పెట్టారు. తిరుపతి లోతట్టుప్రాంతాల్లో అలర్ట్‌ ప్రకటించారు ఉన్నతాధికారులు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు విజ్ఞప్తిచేశారు. రెస్క్యూ ఆపరేషన్స్‌ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.