AP New Scheme : ఏపీలో మరో కొత్త పథకం

పెన్షన్ల కోసమే రూ.1,500 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ ఎగ్గొడితే తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ అభివృద్ధి పథకాలు వివరించారు.

AP New Scheme : ఏపీలో మరో కొత్త పథకం

Cm Jagan (1)

CM Jagan explain development schemes : ఒకటో తేదీ ఆదివారమైనా..సెలవైనా సూర్యోదయానికి ముందే పెన్షన్ అందుతోందని సీఎం జగన్ తెలిపారు. పెన్షన్ల కోసమే రూ.1,500 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ ఎగ్గొడితే తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ అభివృద్ధి పథకాలు వివరించారు. అక్కాచెళ్లెళ్లకు ఆక్సిజన్ గా వైఎస్ఆర్ ఆసరా పథకం నిలిచిందన్నారు. మహిళలకు నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా వాళ్లు వ్యాపారంలో నిలదొక్కుకునే అవకాశం లభించిందన్నారు. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.18,750 అందిస్తున్నామని చెప్పారు.

డబ్బులు ఇవ్వడమే కాకుండా కార్పొరేట్ సంస్థలతో టై అప్ చేశామని పేర్కొన్నారు. దీంతో ఒక్కొక్కరు నెలకు రూ.7000 నుంచి రూ.15,000 సంపాదించే అవకాశం కలిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 10 వేల మంది మహిళలు రిటైల్ దుకాణాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. మహిళాసాధికారతతో రెండున్నరేళ్లలో సువర్ణాధ్యాయం లిఖించామని చెప్పారు. రాష్ట్రంలో 17వేల జగనన్న కాలనీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలందించామని చెప్పారు.

Pensions : పెన్షన్ రద్దయిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఇంటి నిర్మాణాలు కూడా పూర్తైతే ఒక్కో మహిళ చేతిలో రూ.5-10 లక్షల ఆస్తి ఉంటుందని చెప్పారు. ఇలాంటి మంచి పథకాన్ని ఆపాలని చూడటం ధర్మమేనా అని ప్రశ్నించారు. మంచి ప్రయత్నాన్ని అడ్డుకుంటే దేవుడు మొట్టికాయలు వేకుండా ఉంటాడా అని అన్నారు. కుప్పంలో అలాంటి మొట్టికాయలే వేశాడని పేర్కొన్నారు. కుప్పం ఎఫెక్ట్ చంద్రబాబుపై పడింని తమ వాళ్లంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నారో..లేదో మరి బీఏసీ సమావేశానికి చంద్రబాబు రాలేదన్నారు. ఆయనకున్న కష్టమేంటో తనకైతే తెలియదన్నారు.

జగనన్న విద్యా దీవెన ద్వారా 18 లక్షల 81 వేల మందికి రూ.5,53 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30 లక్షల 16 వేల మందికి మేలు కల్గుతుందన్నారు.

MLA Etala : రైతుల మరణాలకు కేసీఆర్ దే బాధ్యత : ఎమ్మెల్యే ఈటల

77 గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3 లక్షల 28 వేల మందికి రూ.982 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 9వ తేదీ నుంచి ఈబీసీ నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.