MLA Etala : రైతుల మరణాలకు కేసీఆర్ దే బాధ్యత : ఎమ్మెల్యే ఈటల

గత 45 రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వరి ధాన్యం రోడ్లు, కల్లాల్లో ఎండకు ఏండీ వర్షానికి తడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

MLA Etala : రైతుల మరణాలకు కేసీఆర్ దే బాధ్యత : ఎమ్మెల్యే ఈటల

Etala

Etala Rajender criticized CM KCR : గత 45 రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వరి ధాన్యం రోడ్లు, కల్లాల్లో ఎండకు ఏండీ వర్షానికి తడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. పండిన పంటలను కాపాడుకోవడానికి వరి కుప్పల మీద రైతుల ప్రాణాలు వదులుతున్న దీన స్థితి కనిపిస్తుందని తెలిపారు. ప్రభుత్వం బాధ్యత మరిచి ఏ ధర్నా చౌక్ ను నిషేధించిందో అదే ధర్నా చౌక్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత మరిచి కేంద్రం మీద నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ అహంకారపు బుద్ధి వల్ల తెలంగాణ రైతాంగం కంటి మీద కునుకు లేకుండా చనిపోతున్నారని.. ఆ బాధ్యత కేసీఆర్ దేనని అన్నారు. వడ్లకు ఐకేపీ, హమాలి చార్జీలు రవాణా చార్జీలు, ఎఫ్ సీఐ బియ్యం అన్ని కేంద్రమే ఇస్తుందని తెలిపారు. ప్రపంచానికే సీడ్ అందించే రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. భవిష్యత్ బాయిల్డ్ రైస్ వినియోగం ఉండదని ఆ రోజే చెప్పామని గుర్తు చేశారు. దేశంలో కోటి ఎకరాల మాగాణి ఉందని చెప్పిన ముఖ్యమంత్రి.. కోటి టన్నులు అమ్మగలిగే మార్కెట్ శక్తి లేదా చెప్పాలన్నారు.

Beggar Death Viral : యాచకుడి అంతిమ‌యాత్ర‌కు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..ఘనంగా అంతిమ వీడ్కోలు

హుజురాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టి.. మద్యం ఏరులై పారించి అన్నిటికీ జీవోలు ఇచ్చి వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అహంకారం బొంద పెట్టిన రోజే తెలంగాణలో అసలైన దీపావళి జరిగిందన్నారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్ర వాటా ఫసల్ భీమా కట్టక రైతు రాక్షసిగా మారినప్పుడు ఆ నిధులు వాపసు పంపించినవు అన్నారు. ప్రభుత్వ పరమైన పని అంటే జనాలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.