×
Ad

Accident : కర్నూలు బస్సు ప్రమాదం ప్రాంతంలో మరో యాక్సిడెంట్.. మూడు కార్లు.. ఒక కంటైనర్ ఢీ.. హైవేపై బీభత్స వాతావరణం

Accident బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు ఓ కంటైనర్ ట్రక్కు వెళ్తుంది. చిన్నటేకూరు - చెట్ల మల్లాపురం ప్రాంతంలోకి రాగానే ఆ ట్రక్కు ముందు వెళ్తున్న కార్లను

Accident

Accident : కర్నూల్ జిల్లా శివారు ప్రాంతంలో చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై ఇటీవల బస్సు దగ్దమై 19మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర విషాదం మరువక ముందే.. అదే ప్రాంతంలో మరో మేజర్ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నటేకూరు – చెట్ల మల్లాపురం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు ఓ కంటైనర్ ట్రక్కు వెళ్తుంది. చిన్నటేకూరు – చెట్ల మల్లాపురం ప్రాంతంలోకి రాగానే ఆ ట్రక్కు ముందు వెళ్తున్న కార్లను ఢీకొట్టింది. ఒకదాని తర్వాత ఒకటి ఢీకొనడంతో హైవేపై బీభత్స వాతావరణం ఏర్పడింది. చివరికి కంటైనర్ డివైడర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది.

ఈ ఘటనలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. మూడు కార్లు డ్యామేజ్ కావడంతో అటుగా వెళ్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Bus Accident : మరో ఘోర బస్సు ప్రమాదం.. బోల్తా పడిన టూరిస్టు బస్సు .. ఒకరు మృతి.. 45మందికిపైగా గాయాలు