big tiger died Nallamala
big tiger died Nallamala : ఏపీలో పెద్ద పులుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అరుదైన వన్యప్రాణి సంరక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నల్లమలలో పెద్ద పులులు వరుసగా చనిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో తాజాగా మరో పెద్దపుల్లి మృతి చెందింది. అనుమానాస్పద స్థితిలో ఒక పెద్దపులి చనిపోయివుంది.
Tiger Death: నల్లమల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి
పెద్దపులి మృతిని గోప్యంగా ఉంచడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పెద్దపుల్లిది సహజ మరణమేనా? లేదా వేటగాళ్ల ఉచ్చులో పడి చనిపోయిందా? అన్న సందేహాలు సర్వత్రా కలుగతున్నాయి. పులి మృతిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.