Tiger Death: నల్లమల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి

ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ బైర్లూటి రేంజి నల్లమలలోని పెద్దఅనంతపురం సెక్షన్ లో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి చెందింది

Tiger Death: నల్లమల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి

Tiger

Tiger Death: నల్లమల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి చెందడం మంగళవారం కలకలం రేపింది. ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ బైర్లూటి రేంజి నల్లమలలోని పెద్దఅనంతపురం సెక్షన్ లో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి చెందింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈఘటన మంగళవారం స్థానికంగా కలకలం రేగింది. నల్లమల అటవీ ప్రాంతంలో గతంలో కూడా ఒక పెద్దపులి మృతి చెందింది. ప్రస్తుతం పులి మృతి చెందడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులోపడి పెద్దపులి మృతి చెందిందని, ఎండలకు మంచి నీరు దొరక్క మృతి చెందిందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే నల్లమల అటవీప్రాంతంలో పెద్ద పులి మృతి చెందడంపై అటవీశాఖ ఉన్నతాధికారులు గోప్యత పాటించారు.

Also read:Cyclone Asani : అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష

బైర్లూటి నుంచి సంఘటనా స్థలంలో జాగిలాలతో కూడిన క్లూస్ టీం గాలింపు చేపట్టింది. అటవీశాఖ అధికారులు పెద్దపులి మృతి సంఘటన బయటకు పోక్కకుండా జాగ్రత్త పడ్డారు. మీడియా ప్రతినిధులు ఫొన్లు చేస్తున్నా ఫారెస్ట్ అధికారులు స్పందించలేదు. సిబ్బంది అందరు ముందు జాగ్రత్తగా ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయడంపై అనుమానం వ్యక్తం అవుతుంది. రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డ అధికారులు..వన్యప్రాణి వైద్యుల సహాయంతో అడవిలోనే పెద్ద పులి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిసింది. కాగా జాతీయ జంతువైన పెద్దపులుల మృతి పై వన్యప్రాణి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read:Petrol Attack : జగిత్యాల జిల్లాలో దారుణం.. అధికారులపై పెట్రోల్‌ స్ప్రే చేసి నిప్పంటించాడు