Cyclone Asani : అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు సమీక్షించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్దంగా ఉంచారు.

Ajay Bhalla Review On Asani Cyclone
Cyclone Asani : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు సమీక్షించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్దంగా ఉంచారు. అక్కడి పరిస్ధితిని గురించి వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు.
తుపాను రేపు ఉదయం నుండి మధ్యాహ్నం లోపల కాకినాడ-విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. అసని ప్రభావం ఏపీలోని కాకినాడ,విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని IMD అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావంతో ఆంధ్రా తీరంలో గంటకు 75 నుంచి 95 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఒడిశా తీరంలో 45-65 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో 9 NDRF బృందాలను మొహరించారు. మరో 7 బృందాలను సిధ్దంగా ఉంచారు. ఒడిశా తీరంలో ఒక NDRF బృందాన్ని మొహరించారు. మరో 17 బృందాలను సిధ్దంగా ఉంచారు. పశ్చిమ బెంగాల్ లో 12 NDRF బృందాలను మొహరించారు. మరో ఐదు బృందాలను సిధ్దంగా ఉంచారు.
అవసరమైతే అదనపు బలగాలు కూడా సిధ్దంగా ఉన్నాయని అజయ్ భల్లా చెప్పారు. తుపాను పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను అజయ్ భల్లా ఆదేశించారు.
Also Read : Cyclone Asani : మూడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం