budda venkanna..mudragada padmanabham
budda venkanna..mudragada padmanabham : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘లేఖ’ల విమర్శనాస్త్రాలు కొసాగుతున్నాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు, సెటైర్లతో లేఖలు రాస్తుంటే..మరోపక్క టీడీపీ నేత బుద్ధా వెంకన్న ముద్రగడ లేఖలకు కౌంటర్ ఇస్తున్నారు. ముద్రగడ రాసే ప్రతీ లేఖలు సమాధానం ఇస్తామంటూ బుద్ధా వెంకన్న కొన్ని రోజుల క్రితం ముద్రగడకు కౌంటర్ ఇచ్చిన సందర్భంగా తెలిపారు. ముద్రగడ దమ్ముంటే నాపై పోటీ చెయ్యి అంటూ మరోసారి పవన్ కల్యాణ్ కు సవాల్ విసురుతు లేఖ రాశారు. దీంతో బుద్దా వెంకన్న ఆయనకు మరోసారి బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారు.
ఈ లేఖలో ముద్రగడ గారు మీది పొరపాటా లేక గ్రహపాటా? 1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని 1993 – 1994లో ఎలా కలుస్తారు? ‘ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా? అంటూ సెటైర్ వేశారు. 1993 – 1994 లో పత్తిపాడు ఎం.ఎల్.ఏ గా మీరు, ముఖ్యమంత్రిగా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి వున్నారు..మీరు చెప్తున్న కేసులు అప్పుడు మీరు శాసనసభ్యులుగా వున్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులే అని మరిచిపోయారా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
Mudragada Padmanabham : మీ బెదిరింపులకు భయపడి నేను లొంగిపోను.. పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాసిన ముద్రగడ
అప్పటి విషయం చంద్రబాబు గారికి ఆపాదించడం పొరపాటు కాదా?మీరు ఈ లేఖలతో ఎందుకు జరగని విషయాలను జరిగినట్టు ప్రస్తావిస్తున్నారు?ఎందుకు మీరు చంద్రబాబుని ప్రతివిషయంలో లాగుతారు?అంటూ ప్రశ్నించారు.రాజకీయంగా ఏదన్నా మాట్లాడండి తప్పు లేదు.. కానీ చంద్రబాబు గారికి కులాన్ని ఆపాదించకండి.. ఆయన అన్ని కులాలని సమానంగా చూస్తారు అంటూ పేర్కొన్నారు.
కాగా.. ఈరోజు ముద్రగడ పవన్ కల్యాణ్ కు రాసిన లేఖలో కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవాలన్నారు. “ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండి” అని పేర్కొన్నారు. ఇలా ఏపీ రాజకీయాల్లో లేఖలు కీలకంగా మారాయి. కొన్ని రోజుల క్రితం ముద్రగడి పవన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
Mudragada Letter : పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ, ఏమన్నారంటే..