Another petition filed in Andhra pradesh capital issue supreme court
Andhra pradesh : ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ వేశారు. ఇప్పటికే అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పుపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.అలాగే ఏపీ ప్రభుత్వం కూడా. జనవరి (2023)31న అమరావతి రాజధాని కేసును విచారించనుంది సుప్రీంకోర్టు. ఈక్రమంలో వస్తాన్ వలీ దాకలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి రాజధాని కేసును కూడా సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని శివ రామకృష్ణ కమిటీ సూచించిన విషయం తెలిసిందే.
ఏ రాష్ట్రానికైనా రాజధాని ఏది అంటే ఠక్కున చెప్పేయొచ్చు.కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటువంటి భాగ్యం లేదు. రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితిలో కాదు కాదు దుస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాజధాని కూడా లేకుండా ఉన్న రాష్ట్రానికి మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ‘అమరావతి’ని రాజధానిగా నిర్ణయించింది. అది అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ కూడా మద్దతు తెలిపింది. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి ఒక్కటే రాజధాని కాదు ఏపీకి మూడు రాజధానులు అంటూ అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా రాజధానులు అంటూ ప్రకటించింది. దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. రెండేళ్లుగా ధర్నాలు చేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన మాకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీకోర్టు మెట్లెక్కారు.