Kethireddy Pedda Reddy : ఎనీ టైమ్, ఎనీ ప్లేస్.. నేను రెడీ- జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్

Kethireddy Challenge Prabhakar Reddy : ఎన్నికలు అయిపోయే వరకు నిన్ను ఏమీ అనను. నీ మాదిరి నేను దిగజారి మాట్లాడలేను. బస్సు యాత్రలో గొడవలు సృష్టించాలని చూస్తున్నావు.

Kethireddy Challenge Prabhakar Reddy (Photo : Facebook)

అనంతపురము జిల్లా తాడిపత్రిలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదం ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. రా చూసుకుందాం.. నీ పతాపమో, నా పతాపమో అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కావాలని తాడిపత్రిలో గొడవలు పెట్టాలని జేసీ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జేసీ పనికిమాలినోడు, అతడితో ఏమీ కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కోర్టుకెళ్లడం అడ్డుకోవడం.. ఇదేనా అభివృద్ధి అంటే?
”తాడిపత్రిలో హాస్పిటల్ కడుతుంటే కాంట్రాక్టర్లను జేసీ బెదిరిస్తున్నారు. మూడు నెలల నుండి ప్రతి కాంట్రాక్టర్ ని బెదిరిస్తున్నారు. మున్సిపాలిటీలో ఎన్ని టెండర్లు పిలిచారో? ఎన్ని వర్కులు చేశారో? జేసీ బయటపెట్టాలి. సేవ్ తాడిపత్రి అంటే ప్రతి ఒక్క అభివృద్ధి పనిని అడ్డుకుని కోర్టుకు వెళ్లి స్టే తేవడమా? బాబా గుడి కడతానని డబ్బులు వసూలు చేసి నీ ఇంట్లో పెట్టుకున్నావు. గత 30ఏళ్లలో మీ కుటుంబం చేసిన అభివృద్ధిపై మీరు చర్చకు సిద్ధమా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను చర్చకు సిద్ధం.

Also Read : కేంద్రం ఇచ్చిన ఆ కోట్ల రూపాయలు ఏమయ్యాయి? సీఎం జగన్‌ను ప్రశ్నించిన పురంధేశ్వరి

నీకు దమ్ము, ధైర్యం ఉంటే రా..
నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులు. నీ చుట్టూ ఉన్నది మట్కారాయుళ్లు, వ్యభిచారులు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా. చెత్త మాటలు వద్దు. నాతో తన్నులు తింటే నీకు సింపతీ వస్తుందని అనుకుంటున్నావు. ఎన్నికలు అయిపోయే వరకు నిన్ను ఏమీ అనను. నీ మాదిరి నేను దిగజారి మాట్లాడలేను. బస్సు యాత్రలో గొడవలు సృష్టించాలని చూస్తున్నావు. ఇప్పుడు దాని జోలికి నేను పోను” అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

జేసీ.. నీ సంగతి తేలుస్తా..
ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదంతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కార్మికులతో కలిసి ఆసుపత్రి నుంచి జేసీ నివాసం వద్దకు ర్యాలీగా బయలుదేరగా.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

Also Read : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఎన్నికల తర్వాత నీ సంగతి తేలుస్తా, అంతవరకు జాగ్రత్త అంటూ జేసీని హెచ్చరించారు. అంతేకాదు తాడిపత్రిలో నీ ఇంటిని కూల్చే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయంటూ జేసీకి వార్నింగ్ ఇచ్చారాయన. ప్రతి పనిని అడ్డుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి తేలుస్తా అంటూ సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.