AP SSC Exam 2027: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. నవంబర్ 11 నుంచి ఫీజుల చెల్లింపు.. పూర్తి వివరాలు మీకోసం!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి(AP SSC Exam 2027) పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది.

Ap 10th class ssc public exam fee schedule released

AP SSC Exam 2027: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2027 మార్చి నెలలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారులు అధికారికంగా విడుదల చేశారు. పదో తరగతి(AP SSC Exam 2027) విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. నిర్ణీత గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తే లేదని విద్యాశాఖ స్పష్టం చేయడంతో, విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ఫీజులు చెల్లించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించారు.

Indiramma Towers: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 4 నగరాల్లో ఇందిరమ్మ టవర్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ఆలస్య రుసుము వివరాలు.. డిసెంబర్ 15 వరకు చెల్లింపులకు అవకాశం:

సాధారణ గడువు ముగిసిన తర్వాత నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రూ.50 ఆలస్య రుసుముతో, డిసెంబర్ 3 నుంచి 9 వరకు రూ.200 అదనపు రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. చివరిగా డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజును స్వీకరించనున్నారు. సాధారణ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 ఫీజుగా నిర్ణయించగా, 3 సబ్జెక్టుల వరకు రాసే వారికి రూ.110, ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు అదనంగా రూ.60, వయోపరిమితి సడలింపు కోరే వారికి రూ.300 రుసుముగా ఖరారు చేశారు.

ఆన్‌లైన్ లాగిన్ ద్వారానే చెల్లింపులు.. సీఎఫ్ఎంఎస్ చలాన్లకు అనుమతి లేదు:

విద్యార్థులు తమ సంబంధిత పాఠశాల ఆన్‌లైన్ లాగిన్ ద్వారానే పరీక్ష ఫీజును చెల్లించాలని విద్యాశాఖ అధికారులు కఠిన నిబంధనలు విటించారు. బ్యాంకులు లేదా సీఎఫ్ఎంఎస్ (CFMS) చలాన్ల ద్వారా నేరుగా చెల్లించే ఫీజులను ఏమాత్రం ఆమోదించబోమని స్పష్టం చేశారు. అలాగే మాన్యువల్ నామినల్ రోల్స్ సమర్పించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైతం ఆన్‌లైన్ ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు ఆదేశించారు.