నందిలాగా భలే ఉంది : పుంగనూరు ఆవుదూడ..ధర రూ.3లక్షలు..!!

AP 14 mounths Punganur calf cost Rs.3 Lakhs  : ఆవుదూడలు చాలా ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. అవి చెంగు చెంగున గెంతులేస్తుంటే మైమరచిచూస్తుండిపోవాలనిపిస్తుంది. అటువంటిది పుంగనూరు ఆవుదూడ చూస్తే ఇక కళ్లు తిప్పుకోలేం. సాక్షాత్తు పరమశివుడి వాహనం అయిన నందిలాగా ఉంటుంది. పొట్టిగా..బొద్దుగా ఉండే పుంగనూరు ఆవులు చూడముచ్చటగా ఉంటాయి. అవి పొట్టిగా ఉన్నా చాలా గట్టివండోయ్..వాటి ధర వింటే బేజారెత్తాల్సిందే. అటువంటి పుంగనూరు ఆవుకు పుట్టిన ఓ దూడ ఏకంగా రూ.3లక్షలు ధర పలికింది.

పుంగనూరు జాతికి చెందిన 14 నెలల ఆవుదూడ ఏకంగా రూ.3 లక్షల ధర పలికింది. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలోని వీరవల్లి గ్రామానికి చెందిన లంక సురేష్ అనే రైతు ఈ పుంగనూరు ఆవుదూడను అమ్మకానికి పెట్టారు. ఆ ఆవుదూడను చూసి వదల్లేక హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రూ.3లక్షలకు కొన్నారు. సురేంద్రకు మేలు జాతి ఆవులను పెంచి పోషించటమంటే చాలా ఇష్టం.

పుంగనూరు,ఒంగోలు, గిర జాతి అవుల్ని పెంచుతుంటారాయన. ఈ క్రమంలో పక్కా పుంగనూరు జాతకి చెందిన ఆవుదూడను రూ.3లక్షలకు అమ్మారు. ఆ ఆవుదూడకు తెల్లటి రంగులో ఉండి ఒంటిపై చిన్న మచ్చకూడా లేకపోవటంతో ఇంత ధర వచ్చిందని..పొట్టిగా..బొద్దుగా ఉంటూ అచ్చు నందిలాగ ఉండే ఈ పుంగనూరు ఆవుల్ని పెంచుకుంటే శుభంకలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు.

ట్రెండింగ్ వార్తలు