74 Years Old Man Commits Suicide
74 years Old man commits suicide : ఎవరన్నా..చిన్నగా దగ్గినా..తుమ్మినా అమ్మో కరోనా ఏమో అని ఆమడదూరం జరిగిపోతున్న పాపిష్టి కరోనా రోజులివి. అసలు ఆ వ్యక్తికి సాధారణమైన దగ్గేమో..సాధారణమైన జలుబే అనే మాటే గుర్తు రావట్లేదు జనాలకు. మామూలు జలుబులకు కూడా భయపడిపోతున్న పరిస్థితులు. ఇటువంటి కరోనా రోజుల్లో ఓ వృద్ధుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది. చిన్నగా దగ్గులు..తుమ్ములతో బాధపడుతున్న వృద్ధుడిని జనానాలు అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. ఆఖరికి ఇంట్లో వాళ్లు కూడా అతన్ని కరోనా పరీక్షలకు తీసుకెళ్లాలని ధ్యాస కూడా లేకుండా వివక్షగా చూస్తుండటంతో తనకు అసలు కరోనా ఉందో లేదో అని పరీక్షలు కూడా చేయించుకోవాలనుకోలేదు పాపం ఆ వృద్ధుడికి. తననొక అంటరానివాడిగా చూస్తుండటాన్ని తట్టుకోలేకపోయాడు. అంతే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. ఇటువంటి దారుణ ఘటనలకు కారణమవుతోంది కరోనా వివక్ష.
జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోన్న ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అంటరానివాడిగా చూశారు. కనీసం అతన్నికి పరీక్షలు కూడా చేయించకుండానే కరోనా వచ్చేసిందని వాళ్లకు వాల్లే అనేకుని వివక్ష చూపించారు. కరోనా వచ్చిందేమోనని దూరంగా పెడుతున్నారు. అసలే అనారోగ్యంతో బాధపడుతోన్న ఆ వృద్ధుడు గ్రామస్థుల తీరుకు..కుటుంబ సభ్యుల వివక్షను భరించలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్య చేకున్నన విషాద ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మర్లపాలేనికి చెందిన గాసర్ల హరిబాబు అనే 74 వృద్ధుడు గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన పట్ల జాలి చూపించి, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సాయం చేయడం మానేసి అందరూ వివక్షతోనే చూశారు. దీంతో మనస్తాపానికి గురయ్యారు. కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు పరీక్ష కూడా చేయించుకోకుండానే భయంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరోనా వచ్చినవారిని వివక్షతతో చూడవద్దని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా..ఇటువంటి ఘటనలు కొనసాగుతుండటం ఈ కరోనా కాలంలో సర్వసాధారణంగా మారిపోతుండటం విచారించాల్సని విషయం.