ap assembly
AP Assembly Sessions : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటుతోంది. అయితే, ఇప్పటి వరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సమావేశాలు ప్రారంభం తొలిరోజే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టనుండగా.. ఆ తరువాత కనీసం పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ తో పాటు ఇతర బిల్లులను సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది.
Also Read: Gold Price: తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా…
గత వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సమర్పించింది. మొత్తం రూ. 2,86,389 కోట్లకు బడ్జెట్ సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి జులై 31వ తేదీ వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40గ్రాంట్ల కింద రూ. 1,90,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది. ఆ తరువాత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉడటంతో కూటమి ప్రభుత్వం జులైలో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తీసుకుంది. అయితే, నవంబర్ వరకు నాలుగు నెలల కాలానికి తాత్కాలిక బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం పొందింది. ప్రస్తుతం ఆ గడువు ముగుస్తుండటంతో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది.