AP BAC Meeting : అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ అనుసరించిన వైఖరిని ఖండించారు. గవర్నర్ ను అవమానించారని సీరియస్ అయ్యారు...

Cm Jagan
CM Jagan Mohan Reddy Angry On Acham Naidu : టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ అనుసరించిన వైఖరిని ఖండించారు. గవర్నర్ ను అవమానించారని సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 2022, మార్చి 07వ తేదీ సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతనలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన, అనీల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హజరయ్యారు. గవర్నర్ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదని స్పష్టం చేశారు. వయస్సులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని సీఎం జగన్ తెలిపారు.
Read More : AP Assembly : గవర్నర్ ప్రసంగం.. టీడీపీ బాయ్ కాట్, మార్షల్ రంగ ప్రవేశం
సోమవారం నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. సభలో ఆయన ప్రసంగం మొదలు కాగానే.. టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు గవర్నర్ స్పీచ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. టీడీపీ సభ్యులు ఒక్కసారిగా వెల్ లోకి దూసుకొచ్చి గవర్నర్ ప్రతులను చింపి విసిరేశారు. వారి ఆందోళన ఎంతకు సద్దుమణగకపోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు.
Read More : Andharpradesh : ఏపీ అసెంబ్లీలో రచ్చ స్టార్ట్.. టీడీపీ ఆందోళనలు, నినాదాలు
చివరకు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. గవర్నర్ స్పీచ్ అనంతరం బీఏసీ మీటింగ్ జరిగింది. ఎన్ని రోజులు సభలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. రెండో రోజు దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి సభలు సంతాపం తెలియచేస్తాయి. సంతాప తీర్మానం అనంతరం సమావేశం ముగుస్తుంది. 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.