Somu Veerraju Letter To CM Jagan : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాశారు. వినాయక చవితి పండుగను స్వేచ్చగా జరుపుకునేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చవితి ఉత్సవాలపై నిబంధనలు విధించడం సరికాదన్నారు సోము వీర్రాజు. చవితి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్, సాంస్కృతిక కార్యక్రమాలను అడ్డుకోవద్దని తన లేఖలో సీఎం జగన్ ను కోరారు సోము వీర్రాజు.
ప్రతీ మండపానికి టెంపరరీ కరెంట్ లైన్ తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. నిబంధనల పేరుతో ప్రభుత్వకార్యాలయాల చుట్టూ మండపాల నిర్వాహాకులను తిప్పుకుంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. చవితి ఉత్సవాలను నిర్భయంగా జరుపుకునేలా అవకాశం కల్పించాలని తన లేఖలో సీఎం జగన్ ను కోరారు సోము వీర్రాజు.