Chandrababu challenge To Jagan : నేను కుప్పంలోనే ఉంటా..జగన్..పులివెందుల నుంచి రౌడీలను తెచ్చుకో అంటూ చంద్రబాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం మూడోరోజు పర్యటనలో జగన్ కు సవాల్ విసిరారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటూ వైసీపీ కార్యకర్తలు పెను విధ్యంసం సృష్టిస్తున్నారు.ఇటువంటి తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు పర్యటన మూడవరోజు కూడా కొనసాగుతోంది. ఈక్రమంలో చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. ‘నేను కుప్పంలోనే ఉంటా..జగన్ రావాలి..జగన్ కు అవసరమైతే పులివెందుల గూండాలను కూడా తెచ్చుకోవచ్చు..అంటూ సవాల్ విసిరారు. జగన్ నాతో పెట్టుకోవద్దు మీ ఆటలు..ఆగడాలు సాగనివ్వను అంటూ హెచ్చరించారు.

Chandrababu challenge To Jagan : నేను కుప్పంలోనే ఉంటా..జగన్..పులివెందుల నుంచి రౌడీలను తెచ్చుకో అంటూ చంద్రబాబు సవాల్

Chandrababu challenge to Jagan

Chandrababu challenge to Jagan : టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం మూడోరోజు పర్యటనలో జగన్ కు సవాల్ విసిరారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటూ వైసీపీ కార్యకర్తలు పెను విధ్యంసం సృష్టిస్తున్నారు.ఇటువంటి తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు పర్యటన మూడవరోజు కూడా కొనసాగుతోంది. ఈక్రమంలో చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. ‘నేను కుప్పంలోనే ఉంటా..జగన్ రావాలి..జగన్ కు అవసరమైతే పులివెందుల గూండాలను కూడా తెచ్చుకోవచ్చు..అంటూ సవాల్ విసిరారు. జగన్ నాతో పెట్టుకోవద్దు మీ ఆటలు..ఆగడాలు సాగనివ్వను అంటూ హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలపైనా..తనపైనా దాడి చేస్తుంటూ గూండాల్లా వ్యవహరిస్తుంటే పోలీసలు చోద్యం చూస్తున్నారంటూ దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థ సర్వనాశనమైందని..అధికారానికి గులాంగిరీ చేస్తోంది అంటూ విమర్శించారు.

బ్రిటీష్ వారికి మీకు తేడా ఏముంది అంటూ ప్రశ్నంచారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను..అందుకే సంయమనంగా వ్యవహరిస్తున్నానని..ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని అది తెలిసి తట్టుకోలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని జగన్ ప్రోత్సాహంతోనే పోలీసులు రెచ్చిపోతున్నారంటూ మండిపడ్డారు. పోలీసులు బానిసల్లా వ్యవహరిస్తు అధికారపార్టీ కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డ చంద్రబాబు డీజీపీమీద కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ డీజీపీ ఓ పనికిమాలిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే జగన్ పారిపోతారని..కుప్పం నియోజకవర్గంపై జగన్ కక్షకట్టారని ఆరోపించారు.

రెండో రోజు నిన్నటి పర్యటనలో దమ్ముంటే, మగాళ్లయితే ఇప్పుడు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం జగన్, డీజీపీ వచ్చినా సరే అని ఛాలెంజ్ చేశారు. జగన్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని అన్నారు. జగన్ రెడ్డి చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారని మండిపడ్డారు. కుప్పం చరిత్రలో ఇదొక చీకటి రోజని అన్నారు. ఇలాంటి దారుణాలు కుప్పంలో గతంలో ఎప్పుడూ జరగలేదని..ప్రశాంతంగా ఉండే కుప్పాన్ని రణరంగంగా మార్చిన ఘతన జగన్ దేనని అన్నారు.

పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గూండాలు, రౌడీలను అణచి వేసిన చరిత్ర టీడీపీదని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వీధికొక రౌడీని తయారు చేసిందని అన్నారు. రౌడీలను మంత్రులను చేసిన ఘనత జగన్ దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై టీడీపీ వాళ్లను ఎవరైనా కొడితే నేరుగా వాళ్లింటికి వస్తానని హెచ్చరించారు. ఇంటికొచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తాను బతికున్నంత వరకు ఏమీ చేయలేరని చెప్పారు. ధర్మపోరాటాన్ని తాను కుప్పం నుంచే ప్రారంభిస్తున్నానని చెప్పారు. జగన్ పాలనపై రాష్ట వ్యాప్తంగా వ్యతిరేకత, తిరుగుబాటు మొదలయిందని అన్నారు.

అంతకు ముందు కుప్పంలో అన్నా క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయాలని వీరికి ఎలా అనిపించిందని మండిపడ్డారు. వీరి ముఖాన ఉమ్మేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరు అన్నం పెట్టరు, పెట్టేవాళ్లను పెట్టనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.