Daggupati Purandeswari : ఎంపీగా, కేంద్రమంత్రిగా,ఇప్పుడు ఏపీ బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలిగా పురంధేశ్వరి..

ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ఇప్పుడు ఏపీ బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలిగా పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం.

Purandeswari as AP BJP New Chief

AP BJP First women Chief Daggupati Purandeswari : బీజేపీ అధిష్టానం దగ్గుపాటి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది. దీంతో ఆమె కొత్త రికార్డు ఏపీలో మొదటి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు క్రియేట్ చేశారు. నందమూరి తారకరామారావు కుమార్తె, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎంపీగా పనిచేసిన దగ్గుపాటి వెంకటేశ్వరావు భార్య పురంధేశ్వరి. తన దైన శైలిలో రాజకీయాల్లో మంచి గుర్తింపు పొందారు. యూపీఏలో ఎంపీగాను, కేంద్రమంత్రిగాను పనిచేశారు.

కాంగ్రెస్ లో చేరిన ఆమె అతి తక్కువ సమయంలోనే పార్టీలో పేరు తెచ్చుకున్నారు. అలా కాంగ్రెస్ అధిష్టానం మన్ననలు పొందిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో బాపట్ల నియోజకవర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆతరువాత 2009లో విశాఖ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల, మానవ వనరుల అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రిగా పని చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె. అంతటి ఘనకీర్తి ఉన్న ఎన్టీఆర్ కుమార్తె అయిన ఆమె కాంగ్రెస్ లో చేరటం అప్పట్లో పెను సంచలనంగా మారింది.

Daggupati Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి .. మొదటి మహిళా చీఫ్‌గా రికార్డ్

పురంధేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ చేరారు. ఆమె అనంతరం బీజేపీలో గౌరవనీయ పదవుల్లో సేవలందించారు. బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వివిధ హోదాల్లో పని చేసిన ఆమెను 2023 జులై 4న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది. అలా బీజేపీలో తనకు అప్పగించిన ప్రతీ పనిని తనదైన శైలిలో చక్కటి వాక్చాతుర్యంతో బీజేపీ అధిష్టానం మన్ననలు పొంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.