Daggupati Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి .. మొదటి మహిళా చీఫ్‌గా రికార్డ్

Daggupati Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి .. మొదటి మహిళా చీఫ్‌గా రికార్డ్

Purandeswari as AP BJP New Chief

AP BJP chief Daggupati Purandeswari  : ఎన్నికల సమయంలో బీజేపీ దూకుడు పెంచింది. పలు రాష్ట్రాలకు అధ్యక్షుల మార్పులు చేపట్టింది. కొత్త అధ్యక్షులను నియమిస్తోంది. దీంట్లో భాగంగా ఏపీ, తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియామకాలు చేపడుతోంది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరిని నియమించింది బీజేపీ అధిష్టానం. గత అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో దగ్గుపాటి పురంధేశ్వరిని నియమించింది. దీంతో ఏపీలో మొదటి మహిళా అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొత్త రికార్డు క్రియేట్ చేశారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురంధేశ్వరికి కీలక పదవిని అప్పగించింది. ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో అత్యంత కీలకంగా ఆలోచించి ఈ నియామకాలను చేపట్టింది బీజేపీ అధిస్టానం. దీని కోసం గత కొన్ని రోజుల నుంచి కసరత్తులు చేసిన బీజేపీ అగ్రనేతలు ఆయా రాష్ట్రాల్లో కీలక పదవుల్లో నియమించటానికి సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంట్లో భాగంగానే ఏపీకి దగ్గుపాటి పురంధేశ్వరిని నియమించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ కూడా లేకుండా పోయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏపీలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయా పార్టీలో చేరిపోయారు. ఎక్కువమంది వైసీపీలో చేరారు. కానీ పురంధేశ్వరి మాత్రం 2014లో బీజేపీలో చేరారు. దీంతో ఆమెకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చి గౌరవించింది. కాగా..గతంలో బాపట్ల,విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తె అయిన ఆమె అప్పట్లో కాంగ్రెస్ లో చేరటం సంచలనంగా మారింది.