Purandeswari : ప్రజావేదిక కూల్చటం, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించటమే వైసీపీ ప్రభుత్వం చేసే పని

వైసీపీ ప్రభుత్వానికి కూల్చటం తప్ప నిర్మించటం చేతకాదు. ప్రశ్నించినవారిపై కేసులు పెట్టటం జైళ్లకు పంపించటం తప్ప చేసేదేమీ లేదు. అంటూ మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

Purandeswari : ప్రజావేదిక కూల్చటం, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించటమే వైసీపీ ప్రభుత్వం చేసే పని

AP BJP President Purandeswari

AP BJP President Purandeswari : ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోంది అంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటినుంచి ఏపీలో అరాచకాలు అక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజావేదిక కూల్చటం నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై అక్రమంగా కేసులు బనాయించటం వారిని జైళ్లకు పంపించే రాక్షస పాలన సాగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజావేదికను కూల్చేయటం నుంచి ప్రశ్నించినవారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని జైళ్లకు పంపిస్తున్నారని విమర్శించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిర్మాణాత్మకంగా ముందుకెళుతుంది కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజావేదికను కూల్చటం ప్రారంభించిన ఈనాటికి అటువంటి కూల్చివేతల్నే కొనసాగిస్తోదంటూ విమర్శించారు. జగన్ కు కేవలం కక్షపూరిత పాలన తప్ప అభివద్ధి అనేది లేకుండా చేశారని..కూల్చివేతల్ని మానుకోవాలని..కక్ష సాధింపుచర్యలు రాష్ట్రానికి చేటు తెస్తాయని అన్నారు.

ఏపీలో అమ్ముతున్న మద్యంలో వస్తున్న సమస్యల గురించి కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశానని తెలిపారు. మద్యం పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి సీబీఐతో విచారణ జరిపించాలని లేఖలో వెల్లడించారని తెలిపారు. అలాగే చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎందుకు స్పందించటంలేదు అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తు..చంద్రబాబు అరెస్టుకు కేంద్రానికి సంబంధమేంటి..? అని ప్రశ్నించారు. ఈ కేసును సీఐడీ విచారిస్తోంది. సీఐడీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ఏపీలో రాజకీయ పొత్తుల గురించి మాట్లాడుతు..బీజేపీతో పొత్తులో ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారని తాము కూడా అదే చెబుతున్నామని జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉందని తెలిపారు. టీడీపీ బీజేపీతో వెళితే బాగుంటుందని పవన్ అన్నారని..కానీ పొత్తుల విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలే నిర్ణయం తీసుకుంటారని ఆ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు.