Somu Veerraju
BJP, TDP Alliance : టీడీపీతో పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మా పార్టీ అధిష్టానాన్ని కలిసారు అంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు కొన్ని రోజుల క్రితం వచ్చిన అమిత్ షా,జేపీ నడ్డా వచ్చి సందర్భంగా వైసీపీని విమర్శించారని..మేము వైసీపీ ఒకటి కాదని తెలిపారు అంటూ గుర్తు చేశారు.ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు, అచ్చెన్నాయుడు మాటలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే నేను మాట్లాడానని అన్నారు. కానీ నా మాటలను విమర్శలుగానో.. వ్యతిరేకంగానో చూడొద్దంటూ సూచించారు.
ఇలాంటి వ్యాఖ్యల వల్లే ఏపీకి నష్టం వాటిల్లుతుందన్నారు.అసలు ఇలాంటి మాటలు అవసరమా..? అని ప్రశ్నించారు.ఇలాంటి కామెంట్ల వల్లే ఏపీలో ఇటువంటి ప్రభుత్వం వచ్చిందన్నారు.పవన్-ముద్రగడ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు.. ప్రజల్లో మమేకం అయ్యారు.పవన్-ముద్రగడ మధ్య గొడవ కులపరమైన గొడవగా మేం భావించడం లేదని అన్నారు సోము వీర్రాజు.దీమోడీ తొమ్మిదేళ్ల పాలనపై బహిరంగ సభలు జరుగుతున్నాయని..ఏపీలో గాలి మారుతోంది.. కమలం వికసిస్తోంది అంటూ ఆశాభావం వ్యక్తంచేశారు.ఏపీలో బీజేపీ బలపడుతోందనే విషయాన్ని ఎవ్వరు దాచిపెట్టలేరు అని అన్నారు.
ఇంటింటికీ జగన్ ప్రభుత్వం వేస్తోన్న స్టిక్కర్లు ఎంతో కాలం నిలవవు అంటూ ఎద్దేవా చేశారు.ఏపీలోని గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు అన్నీ ప్రభుత్వాలు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశాయంటూ ఆరోపించారు.ఏపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం అంటూ బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు.ఏపీలో ప్రాంతీయ పార్టీలు శిఖండి పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు.నాడు-నేడు పేరుతో జరిగే పనులు.. జగనన్న కిట్లల్లో భాగంగా ఇచ్చే యూనిఫారాలన్నీ కేంద్ర నిధులేనని అన్నారు.ఏపీలో జగన్ ప్రభుత్వం డబ్బింగ్ ప్రభుత్వంగా మారింది అంటూ విమర్శలు సంధించారు బీజేపీ నేత సోము వీర్రాజు.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొత్తులపై చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఏ పార్టీ ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటుంది? అసలు పొత్తులు ఉంటాయా? ఉండవా? ఇలా ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న క్రమంలో టీడీపీతో పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో పొత్తులు అంటే ప్రస్తుతం వినిపించే ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన..వీరిద్దరితో బీజేపీ చేరుతుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది.