CM Chandrababu Naidu
CM Chandrababu Naidu : ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పార్థసారధి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు. అనంతరం నారా లోకేశ్ రాజధాని రైతులను పలకరించారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారంటూ అభినందించారు.
Also Read: Rain Alert For AP : మరో అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..! ఎన్ని రోజులు అంటే..
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2024 -25 వార్షిక బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు ఉన్నతాధికారులు బడ్జెట్ పత్రాలను అందజేశారు. బడ్జెట్ పత్రాలకు పయ్యావుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పయ్యావుల భేటీ అయ్యారు.
Also Read: Pawan Kalyan: వైఎస్ షర్మిలకు భద్రత విషయంపై.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉదయం 10గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.