Pawan Kalyan: వైఎస్ షర్మిలకు భద్రత విషయంపై.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

మాది మంచి ప్రభుత్వమే.. కానీ, మెతక ప్రభుత్వం కాదు. ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని పవన్ హెచ్చరించారు.

Pawan Kalyan: వైఎస్ షర్మిలకు భద్రత విషయంపై.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

AP Deputy CM Pawan Kalyan

Updated On : November 10, 2024 / 2:13 PM IST

Dy CM Pawan Kalyan: ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాది మంచి ప్రభుత్వమే.. కానీ, మెతక ప్రభుత్వం కాదు. ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని పవన్ హెచ్చరించారు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోమని అన్నారు.

Also Read: Sajjala Bhargava Reddy: సజ్జల భార్గ‌వ్‌కు షాకిచ్చిన పోలీసులు.. పులివెందులలో కేసు నమోదు.. ఎందుకంటే?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రత విషయంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పిన పవన్.. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మానవజాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం. అటవీశాఖకు తన సంపూర్ణ మద్దతు ఉంటుంది. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని పవన్ అన్నారు. అడవుల సంరక్షణ వాతావరణ మార్పులకు కారణమవుతుంది. వన్య ప్రాణులు, వృక్ష సంరక్షణ కీలకమైనదని పవన్ పేర్కొన్నారు. అటవీశాఖలో విధులు నిర్వహిస్తూ 23మంది ప్రాణాలు కోల్పోయారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. కేరళ రాష్ట్రంలో చందన స్మగ్లర్స్ చేతిలో మన రాష్ట్రానికి చెందిన పందిళ్ళపల్లి శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను మనం మర్చిపోకూడదు. వారిని గుర్తు చేసుకొనే విధంగా ఫారెస్ట్ ఆఫీస్ బ్లాక్ లకు వారి పేర్లు పెట్టాలని పవన్ సూచించారు.

 

రాజస్థాన్ లో బిష్టోయి తెగ ప్రతి మొక్కను పూజిస్తారు. చెట్లను కౌగిలించుకొని తమ ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతారు. ఆటవీ, పర్యావరణ శాఖ తీసుకోనడానికి ప్రాణాలు కోల్పోయిన పందెళ్ళపల్లి శ్రీనివాస్ నాకు రోల్ మోడల్ అని పవన్ కల్యాణ్ చెప్పారు. అటవీశాఖకు నా సంపూర్ణ మద్దతు ఇస్తాను. వివిధ వర్గాల నుంచి అటవీశాఖకు రూ.5 కోట్ల విరాళం సేకరించి ఇస్తానని పవన్ పేర్కొన్నారు. అదేవిధంగా గంజాయి మన్యంతోపాటు రెవెన్యూ భూముల్లో కూడా సాగు చేస్తున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పవన్ చెప్పారు.